ఆ ఒక్క ఫొటో సూపర్‌ స్టార్‌ సహజీవనం గుట్టు రట్టు

Update: 2022-01-31 06:33 GMT
బాలీవుడ్‌ లో ప్రేమ వ్యవహారాలు.. విడాకులు.. సహ జీవనాలు చాలా కామన్‌ విషయాలు అయ్యాయి. ఈ సంస్కృతి మెల్ల మెల్లగా సౌత్‌ సినిమా ఇండస్ట్రీ సెలబ్రెటీలకు కూడా చేరువ అవుతుంది. ఆ విషయం పక్కన పెడితే భార్య తో 2014 లో విడాకులు తీసుకున్న స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ ఇప్పటికి కూడా ఆమె తో సన్నిహితంగా ఉంటున్నాడు.

ఇటీవల కూడా ఇద్దరు కలిసి ఒక పార్టీ లో పాల్గొన్నారు. దాంతో ఇద్దరు మళ్లీ కలిసే అవకాశాలు ఉన్నాయి.. పిల్లల కోసం ఇద్దరు మళ్లీ పెళ్లి చేసుకుంటారని కూడా ప్రచారం జరిగింది. కాని ఇద్దరు పిల్లల కోసం కేవలం స్నేహితులుగా కొనసాగుతున్నారని తేలిపోయింది. ఇద్దరు కూడా వారి వారి వ్యక్తిగత జీవితంలో మరో రిలేషన్ లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. గత కొన్నాళ్లుగా హృతిక్‌ రోషన్‌ సబా ఆజా తో రిలేషన్ లో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి.

Saba Aaja
గతంలో నసీరుద్దీన్ షా తనయుడు ఇమాద్ షా తో రిలేషన్ లో ఉండేది. ఆ విషయాన్ని స్వయంగా ఇమాద్ షా ప్రకటించాడు. కాని కొన్ని కారణాల వల్ల ఇద్దరు బ్రేకప్ అయ్యారనే వార్తలు వచ్చాయి. ఇద్దరి మద్య వివాదానికి కారణం ఏంటీ అనేది తెలియదు కాని.. ఇమాద్‌ షా తో బ్రేకప్ అయిన కొన్నాళ్లకే హృతిక్‌ రోషన్ తో రిలేషన్ ను సబా మొదలు పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది.

బాలీవుడ్‌ మీడియాలో ఈ విషయమై పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ నిజమా కాదా అనే అనుమానాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో హృతిక్‌ రోషన్ ఒక్క ఫొటోతో మొత్తం వ్యవహారం క్లారిటీ ఇచ్చాడు. ఆ ఫొటోలో సబా చేయి పట్టుకుని హృతిక్‌ రోషన్ నడుస్తున్నాడు.

సాదారణంగా చేతులు పట్టుకోవడం.. ముద్దులు పెట్టుకోవడం హగ్‌ చేసుకోవడం ఇండస్ట్రీలో కామన్ విషయాలు. కాని అవన్నీ కూడా కెమెరా ముందు వరకే.. ఆఫ్ ది కెమెరా ఇలా చేయి పట్టుకున్నారు అంటే ఖచ్చితంగా ఇద్దరి మద్య వ్యవహారం కొనసాగుతుంది అనేది మీడియా వర్గాల టాక్‌. హృతిక్‌ రోషన్‌ ప్రస్తుతం సబా ఆజా తో రిలేషన్ లో ఉన్నాడు అనేందుకు ఈ ఒక్క ఫొటో సాక్ష్యం చాలు అన్నట్లుగా బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది. పెద్ద ఎత్తున జాతీయ మీడియా ఈ విషయాన్ని కథలు కథలుగా రాస్తున్నా కూడా ఇప్పటి వరకు హృతిక్‌ రోషన్ నుండి కాని సబా ఆజా కాని ఖండించలేదు. దాంతో ఇద్దరి మద్య ప్రస్తుతం రిలేషన్ కొనసాగుతుంది అంటూ క్లారిటీ వచ్చేసింది. మరి వీరిద్దరి రిలేషన్ కేవలం ఇక్కడి వరకే ఉంటుందా లేదంటే పెళ్లి పీఠల వరకు వెళ్తుందా అనేది చూడాలి.


Tags:    

Similar News