బాలీవుడ్ లో అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’. ఈ చిత్రంలో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి చూపించబోతున్నారు. మన్మోహన్ సింగ్ ను ముందు ఉంచి తెర వెనుక సోనియా గాంధీ ఎలా రాజకీయం నడిపించారు, ప్రభుత్వంను ఆమె ఎలా కంట్రోల్ చేశారు అనే విషయాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఆ విషయాన్ని తాజాగా విడుదలైన ట్రైలర్ లో క్లీయర్ గా చూపించారు.
సోనియా గాంధీ గురించి - మన్మోహన్ గురించి ఆ చిత్రంలో తప్పుగా చూపిస్తున్నారు అంటూ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. మన్మోహన్ గా నటించిన అనుపమ్ ఖేర్ ను కాంగ్రెస్ నాయకులు టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సంచలనాలకు మారు పేరుగా నిలిచిన యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ మూవీ ట్రైలర్ యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అయ్యింది. కాని ఇప్పుడు మాత్రం అది కనిపించడం లేదు.
ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించి - నిర్మాతగా కూడా వ్యవహరించిన అనుపమ్ ఖేర్ ఈ విషయమై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. యూట్యూబ్ లో ఈ చిత్రం ట్రైలర్ కనిపించక పోవడంపై ఆయన యూట్యూబ్ ఇండియా వారిపై ఆగ్రహంతో ఉన్నాడు. మొన్నటి వరకు టాప్ లో ట్రెండ్ అయిన తమ ట్రైలర్ ఇప్పుడు కనీసం ఎక్కడ ఉందో కూడా లింక్ కూడా కనిపించడం లేదు అంటూ వాపోయాడు. తమ ట్రైలర్ ను యూట్యూబ్ వారు తొలగించారు అంటూ ఆయన ఆరోపిస్తున్నాడు. అధికార పార్టీకి మద్దతుగా ఉన్న అనుపమ్ ఖేర్ మూవీ విషయంలో ఇలా జరగడంతో కేంద్ర ప్రభుత్వం కూడా కాస్త సీరియస్ గా ఉన్నట్లుగా జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది.