డా. మన్మోహన్ సింగ్ భారతదేశ మాజీ ప్రధానమంత్రి ఎలా అయ్యారు.. ఆయన ప్రధానమంత్రిగా పనిచేసిన పది సంవత్సరాల కాలంలో చోటుచేసుకున్న పరిణామాలు.. అయన ఎదుర్కొన్న ఇబ్బందులలాంటివి ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్'. ఈ సినిమా మన్మోహన్ సింగ్ కు మీడియా సలహాదారు, పీఎం ఆఫీసుకు అధికార ప్రతినిథిగా ఆ సమయంలో పనిచేసిన సంజయ్ బారు రాసిన పుస్తకం 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' ఆధారంగా తెరకెక్కింది.
ఈ సినిమా ట్రైలర్ ఈ రోజే రిలీజ్ అయింది. ఈ సినిమాలో మన్మోహన్ సింగ్ పాత్రలో సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ నటించగా.. సంజయ్ బారు పాత్రలో అక్షయ్ ఖన్నా నటించాడు. ట్రైలర్ ఆద్యంతం సంజయ్ బారు పాయింట్ ఆఫ్ వ్యూ లో సాగింది. డా. మన్మోహన్ సింగ్ లో ఎటువంటి చెడు లేదని.. అయన భీష్ముడిలాగా తనకు కనబడతాడని సంజయ్ బారు చెప్పడంతో ఈ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. కానీ అయన ఫ్యామిలీ డ్రామాకు బాధితుడిగా మారిపోయాడని.. మహాభారతంలో రెండు ఫ్యామిలీలు ఉంటే ఇక్కడ భారతదేశంలో మాత్రం ఒకే ఫ్యామిలీ ఉందని అన్నారు. నెక్స్ట్ షాట్ లో నే సోనియా గాంధి ని చూపించారు.
2004 లో యూపీఎ చైర్ పర్సన్ గా ఉన్న సోనియా గాంధి ప్రధాన మంత్రిగా మన్మోహన్ సింగ్ పేరును ప్రతిపాదించడం.. అయన ప్రధానమంత్రి కావడం చకచకా జరుగుతాయి. పీఎం బాధ్యతలతో మన్మోహన్ పడిన సంఘర్షణ కొంత చూపించారు. అమెరికా తో జరిగిన న్యూక్లియర్ డీల్ అంశం.. దానిపై జరిగిన హంగామా ఎపిసోడ్ ను చూపించారు. కాశ్మీర్ సమస్యకు పరిష్కారం కోసం ప్రయత్నించినప్పుడు సొనియా పాత్ర మన్మోహన్ తో "మీరు పాకిస్తాన్ తో శాంతి చర్చలు జరుపుతూ ఉంటే నా ప్రధానమంత్రి ఏం చేస్తాడు?" అని ప్రశ్నిస్తుంది. మరో సీన్లో మన్మోహన్ పీఎం పదవికి రాజీనామా చేస్తానని అన్నప్పుడు సోనియా "ఈపరిస్థితి లో రాహుల్ బాధ్యతలు చేపట్టలేడని మీరే ప్రధానిగా ఉండాలి" అని చెప్తుంది.
కాంగ్రెస్ పార్టీ నాయకుల పాత్రలు ఉన్నాయి కాబట్టి వివాదాలు చెలరేగే అవకాశాన్ని కొట్టిపారేయలేం. విజయ్ రత్నాకర్ గుత్తే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకసారి మీరూ ఈ ట్రైలర్ ను చూడండి.
Full View