గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నిక్ జోనాస్ ని పెళ్లి చేసుకుని ఆదర్శ దాంపత్యంతో ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. హిందూ సాంప్రదాయం గొప్పతనాన్ని అమెరికాలో అత్తారింటికి నేర్పిస్తూ అక్కడ ప్రచారం కల్పిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పీసీ అమెరికాలో ఉన్నా సాంప్రదాయం వీడడం లేదు.
ముఖ్యంగా పండగల వేళ పీసీ ఆచారం ముగ్దులను చేస్తోంది. ఇటీవలే దీపావళి పండగకు సంప్రదాయ చీరకట్టుతో దేవుడికి నైవేద్యం పెడుతూ ఆకర్షించింది. అటు భర్త నిక్ జోనాస్ కోరిక మేరకు మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరిస్తూనే..ఇంటిని తీర్చిదిద్దుతోంది.
తాజాగా కత్రినా కైఫ్ కూడా బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ని పెళ్లి చేసుకుంటోన్న సంగతి తెలిసిందే. ఇద్దరు ప్రేమించి వివాహం చేసుకుంటున్నారు. రాజాస్థాన్ వేదికగా ఈ పెళ్లి అతికొద్ది మంది సమక్షంలోనే డిసెంబర్ లో జరుగుతుంది. అలా కత్రినా కూడా ఓ ఇంటికి ఇల్లాలు అయిపోతుంది.
నాలుగు బ్రేకప్ లు తర్వాత రియలైజ్ అయి చివరికి విక్కీ కౌశల్ తో లాక్ అయింది. ఇక బాలీవుడ్ యంగ్ బ్యూటీ అలియా భట్ కూడా రణబీర్ కపూర్ ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతోంది. ఇద్దరు చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. ఈ జంట పెళ్లి రేపోమాపో అన్నట్లు బాలీవుడ్ మీడియా హీటెక్కిస్తోంది. ఆ సంగతి పక్కనబెడితే తాజాగా ఈ ముగ్గురు కలిసి ఓచోట కలిసారు. అప్పుడు ఇలా కెమారాకి ఫోజులిచ్చారు.
ప్రియాంకచోప్రా కుర్చీలో ఆశీనురాలైంది. తనకు ఎడమవైపు కత్రినా కైఫ్..కుడి వైపు అలియాభట్ సన్నిహితంగా కనిపించారు. ఆ ఫోటోని వైరల్ భయాని ఇన్ స్టాలో షేర్ చేసారు. బ్యాండ్ భాజా బ్రైడ్స్! అంటూ ఓ క్యాప్షన్ కూడా ఇచ్చారు. అంటే పీసీకి ఇప్పటికే పెళ్లి అయిపోయింది. కత్రినా... అలియా భట్ పెళ్లి కూడా ఖరారైపోయినట్టే.
ఇక వృత్తి పరంగా ఈ ముగ్గురు భామలు బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కెరీర్ కి అడ్డు లేకుండా పక్కా ప్లాన్ తో ముందుకెళుతున్నారు ఈ టాప్ హీరోయిన్లు. ఇక పీసీ స్ఫూర్తితో ఆలియా కూడా హాలీవుడ్ లో అడుగుపెట్టే ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసినదే.