ఇటీవల విడుదలైన ‘సారంగదరియా’ పాట యూట్యూబ్‌లో దుమ్ము రేపుతోంది. రికార్డుల మోత మోగిస్తున్నది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్‌స్టోరీ ’ చిత్రంలో ‘సారంగదరియా’ అనే జానపద పాట లిరికల్ వీడియోను ఇటీవల విడుదల చేశారు. ఈ వీడియో కేవలం 13 రోజుల్లోనే 47 మిలియన్ వ్యూస్ సంపాదించి పాత రికార్డులన్నీ చెరిపివేసింది. గతంలో అలవైకుంఠపురంలో చిత్రంలో బుట్ట బొమ్మ సాంగ్ 18 రోజుల్లో, రాములో రాములో 27 రోజుల్లో ఈ 47 మిలియన్ వ్యూస్ సాధించగా.. సారంగదరియా పాత రికార్డును చెరిపివేసి ఆల్‌టైం హిట్‌గా నిలిచింది.
సాయిపల్లవి డ్యాన్స్, మంగ్లీ వాయిస్ ఈ పాటకు కొత్త ఊపును తీసుకొచ్చాయి. ఇక శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు యువతను ఆకట్టుకుంటున్నాయి. అయితే సారంగదరియా అనే జానపద పాట చరణం పాతదే అయినప్పటికి సుద్దాల అకోశ్ తేజ దీన్ని డెవలప్ చేశారు. అయితే ఇటీవల ఈ పాటపై వివాదం కూడా చెలరేగింది. ఈ పాట తానే సేకరించాను కాబట్టి క్రెడిట్ తనకు ఇవ్వాల్సిందేనంటూ ‘కోమలి’ అనే జానపద గాయని మీడియా ముందుకు వచ్చింది. అయితే ఈ వివాదానికి శేఖర్ కమ్ముల ఎండ్ కార్డు వేశారు. కోమలికి ఆడియో ఫంక్షన్లో పాడే అవకాశం కల్పిస్తామని.. టైటిల్ కార్డులో ఆమె పేరు వేస్తామని.. కొంత రెమ్యునరేషన్ కూడా ఇస్తామని శేఖర్ కమ్ముల ప్రకటించారు. దీంతో ఈవివాదానికి తెరపడింది.
ఇదిలా ఉంటే ఈ పాట అన్ని వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నది. పల్లెటూరు వాతావరణంలో చేసిన చిత్రీకరణ.. సాయి పల్లవి డాన్స్ యూత్‌ను ఫిదా చేస్తున్నాయి. ఇటీవల సినిమాల్లో జానపద బాణీలకు, పాటకు విపరీతమైన క్రేజ్ వస్తున్నది. చాలా సినిమాల్లో జానపద పాటలను పెడుతున్నారు దర్శక నిర్మాతలు . ఫిదా సినిమాలో 'వచ్చిందే మెల్లా మెల్లగ వచ్చిందే' సాంగ్ ఎన్ని రికార్డులు సృష్టించిందో తెలిసిందే. ఆ సాంగ్ సాయి పల్లవి కి ఎంతో క్రేజ్ తీసుకువచ్చింది. అలాగే సారంగదరియా కూడా సాయి పల్లవి కి మంచి పేరు తీసుకువచ్చింది.