వెండి తెరపై ప్రయోగాలంటే? హీరోయిన్లు ఎవరూ తొందరగా ముందుకు రారు. వీలైనంత వరకూ కంఫర్ట్ జోన్ లో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. తప్పని పక్షంలో మినహా మ్యాకప్ అనేది ఎంత ఈజీగా ఉంటే? అంత హ్యాపీ అనుకునే భామలే ఎక్కువగా తారస పడుతుంటారు. కానీ మరాఠీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ మాత్రం అందుకు భిన్నం అంటుంది.
అమ్మడి కెరీర్ ఎక్కువగా ప్రయోగాలతోనే ముడి పడి ఉంటుందని చెబుతుంది. 'సీతారామం'తో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించింది. సీతామహాలక్ష్మి గా చెరగని ముద్ర వేసిన బ్యూటీ. ప్రిన్సెస్ నూర్ జహాన్ గా కుర్రాళ్ల హృదయాల్ని దోచిన అందం. నిజానికి ఈ రెండు పాత్రలు కూడా ప్రయోగాత్మకమైనవే.
ఇలాంటి పాత్రలు సక్సెస్ అవ్వాలంటే బలమైన భావోద్వేగం ఉండాలి. కంటెంట్ హైలైట్ అవ్వాలి. సీతారామంలో రెండు సమపాళ్లలో కురదిరాయి కాబట్టే సక్సెస్ అయింది. ఈ సినిమా తర్వాత ఒక్కసారిగా బిజీ అవుతుందనుకున్నారంతా. కానీ రీసెంట్ గానే నానితో సినిమా కమిట్ అవ్వడానికే కొన్ని నెలలు సమయం పట్టిందని తెలుస్తోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రయోగాల గురించి మాట్లాడింది. ధైర్యంగా నిర్ణయాలు ఎలా తీసుకోవాలో తెలుసు. ఇలా చేయడం అందరికీ సాహసం చేస్తున్నట్లు అనిపించొచ్చు..కానీ నాకు అలా అనిపించదు. నాకు సవాల్ గా అనిపించేది అలాంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడే. సవాళ్లను స్వీకరించినప్పుడు అసలైన మజా ఉంటుంది.
అందులోనే కిక్ దొరుకుతుంది. నాకు కెరీర్ ఆరంభం నుంచి ఇది అలవాటే. టీవీ రంగంలో ఉన్నప్పుడు ఇలాంటి సవాళ్లు ఎన్నో అధిగమించాను. ఇప్పుడవన్నీ అలవాటైపోయాయి' అని తెలిపింది. హిందీలో రెండు సినిమాల్నిపూర్తి చేసిన మృణాల్.. మరో రెండు సినిమాలు చిత్రీకరణలో ఉన్నాయి. 'సీతారామం' సక్సెస్ గుర్తింపుతో అక్కడా మంచి అవకాశాలు వస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.