తమ అభిమాన తారను చూడాలని అంపశయ్య(మరణం అంచున)పై ఉన్న అభిమాని కోరితే మన స్టార్లు స్పందించే తీరు ప్రతిసారీ ఎంతో హర్షణీయం. టాలీవుడ్ స్టార్లు పలువురు గతంలో తమను చూడాలనుందన్న అభిమానుల కోసం ఆస్పత్రులకు వెళ్లిన సందర్భాలున్నాయి. క్యాన్సర్ రోగుల చివరి కోరికను మన్నించి స్టార్లు కలిసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ కూడా తన మంచి మనసేంటో నిరూపించారు.
తనను చూడాలనుందని కోరిన ఓ అభిమాని కోసం ప్రభాస్ దిగి వచ్చారని అతడి రాకతో 2 గంటల్లో చనిపోయే అభిమాని 20 రోజులు అదనంగా బతికారని భీమవరానికి చెందిన ఓ పెద్దాయన తెలిపారు.క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిన బాలుడు ఆసుపత్రిలో చేరినప్పుడు తన స్నేహితుడి 20 ఏళ్ల కుమారుడిని చూడటానికి ప్రభాస్ వచ్చారని అతడు తెలిపారు. తనను చూడాలన్న బాలుడి చివరి కోరికను మన్నించి ప్రభాస్ వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. బాలుడితో ఒక గంట గడిపారు. అతనిని ముద్దు పెట్టుకున్నారు. 2 గంటల్లో అతను చనిపోతాడని వైద్యులు చెప్పినా బాలుడు 20 రోజులు ఎక్కువ కాలం జీవించారని తెలిపారు.
అవసరం అనుకుంటే తనని పిలవాలని ఆ బాలుడి తల్లిదండ్రులకు ప్రభాస్ తెలిపారట. ప్రభాస్ మంచితనం గురించి చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి? అని అతడు ఎమోషన్ అయ్యారు.ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయినా అభిమానుల కోరికను మన్నించి వారి కోసం ఏం చేయడానికైనా అతడు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు.