ఏపీలో థియేట‌ర్ల‌లో 50శాతం ఆక్యుపెన్సీని ప్ర‌క‌టించిన సీఎం

Update: 2021-04-20 04:30 GMT
ఇటీవ‌ల‌ సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల్ని త‌గ్గిస్తూ జీవో జారీ చేసిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇంత‌లోనే 50శాతం ఆక్యుపెన్సీ నియ‌మాన్ని విధించింది.
పెరుగుతున్న క‌రోనా కేసుల తో భారతదేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కర్ఫ్యూ లేదా పాక్షిక లాక్ డౌన్ ని కొద్దిరోజుల పాటు విధించాల్సి వ‌స్తోంది. ఏపీలో కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది.

ఆ క్ర‌మంలోనే మ‌హ‌మ్మారీ పై నేటి సమీక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి థియేటర్లలోని అన్ని సినిమా హాళ్ళలో 50శాతం ఆక్యుపెన్సీని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఫంక్షన్ హాల్స్ లో ప్ర‌తి ఒక్క‌రి న‌డుమ‌ 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించాలి.

గత రెండు రోజులుగా కరోనావైరస్ భయం కారణంగా సినిమా థియేటర్లు దాదాపు జీరో కలెక్షన్లను నమోదు చేస్తున్నాయి. ఇటీవ‌ల వ‌సూళ్ల ప్ర‌భంజ‌నం సృష్టించిన వ‌కీల్ సాబ్ సైతం రెండో వీకెండ్ నాటికి పూర్తిగా క‌లెక్ష‌న్ల ప‌రంగా నిల్ అయిపోయింది. తాజాగా ప్ర‌భుత్వం విధించిన  50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనను ఎగ్జిబిటర్లు కూడా స్వాగతించారు. టికెట్ రేట్లకు సంబంధించిన జీవోను ప్రభుత్వం సవరించాలని ఆంధ్రప్రదేశ్ లోని ఎగ్జిబిటర్లు కోరుతున్నారు. కొంద‌రు కొత్త రేట్ల‌ను నిర‌సిస్తూ థియేట‌ర్ల‌ను స్వ‌చ్ఛందంగా బంద్ చేశారు.
Tags:    

Similar News