మెగాస్టార్‌ పై ఆ ఫ్యామిలీ అభిమానం ఖరీదు రూ.60 లక్షలు

Update: 2022-08-30 11:30 GMT
వాషింగ్టన్ లో ఒక భారతీయ కుటుంబం బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ పై ఉన్న అభిమానంతో తమ ఇంటి ముందు విగ్రహం ను ఏర్పాటు చేయించారు. విగ్రహ ఏర్పాటు సాదాసీదాగా కాకుండా.. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఏదో తూతు మంత్రం అన్నట్లుగా కాకుండా భారీ ఎత్తున వేడుక నిర్వహించారు.

విగ్రహాన్ని స్థానిక ప్రముఖ నేత తో ఆవిష్కరింపజేశారు. అంతే కాకుండా విగ్రహం ను ఓపెన్‌ చేస్తున్న సందర్భంగా దాదాపుగా 600 మంది గెస్ట్‌ లను ఆహ్వానించి భారీ వినోద కార్యక్రమాలను నిర్వహించి పెద్ద ఎత్తున ఖర్చు చేశాడు. అమితాబచ్చన్‌ అంటే ఆ కుటుంబం మొత్తానికి కూడా ఒక హీరో అన్నట్లుగా కాకుండా దైవం తో సమానం అన్నట్లుగా భావిస్తారట.

అమెరికాలో సెటిల్ అయిన గోపీ సేథ్ మరియు ఆయన భార్య కి అమితాబ్‌ అంటే గొప్ప గౌరవం. ఆయన సినిమాలను చూసి ఇష్టపడటం కాకుండా.. ఆయన్ను ఒక దేవుడిగా భావిస్తారు.

అమితాబచ్చన్ వ్యక్తిగత జీవితం నుండి కూడా తాము ఎంతో స్ఫూర్తి పొందాము. ఆయన కుటుంబం తో వ్యవహరించే తీరు... జనాల్లో ఉండే తీరు మాత్రమే కాకుండా కష్టపడే విధానం మాకు స్ఫూర్తి దాయకం అన్నారు.

ఇండియాలోని రాజస్థాన్‌ లో విగ్రహంను తయారు చేయించి అమెరికాకు తీసుకు వెళ్లారు. అక్కడ ఒక గ్లాస్ బాక్స్‌ లో విగ్రహంను ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు.

ఈ మొత్తం వ్యవహారంకు గోపీ సేథ్ ఏకంగా 60 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసినట్లుగా పేర్కొన్నాడు. ఒక హీరో పై అభిమానం ఉండవచ్చు కానీ మరీ ఇంత అభిమానం ఏంటి బాబోయ్ అంటూ నెటిజన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News