టాలీవుడ్ స్టార్ హీరో ఒకరు ఇటీవలే ఓ కొత్త ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించారు. ఆ సినిమా మొదలవ్వడంతో ఎన్నాళ్లో వేచిన హృదయం అంటూ డైరెక్టర్ ఆనందానికి అవదుల్లేవ్. ప్రాజెక్ట్ ప్రకటించిన కొన్ని నెలలు గడిచిన తర్వాత మొదలవ్వడంతో పట్టలేని అనందంలో ఉబ్బితబ్బితున్నాడు. ఆ వేడుకకు కొంత మంది బడా నిర్మాతలు సహా హీరో కూడా హాజరయ్యాడు. సాధారణంగా ఆ హీరో పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా రేర్. ముఖ్యమైన సినిమాగా భావిస్తే తప్ప అతను హాజరు కాడు.
కానీ ఇటీవలే చోటుచేసుకున్న కొన్నిపరిస్థితులు అక్కడి వరకూ తీసుకొచ్చాయి. ఆ సంగతి పక్కన బెడితే ఈ సినిమా లాంచింగ్ రోజున ఆ స్టార్ హీరో అభిమాన దర్శకుడు..ప్రాణ సమానుడైన స్నేహితుడు మాత్రం హాజరు కాలేదు. ఎంత బిజీగా ఉన్న...ఎక్కడున్నా ఆ స్నేహితుడు మాత్రం ఎప్పుడు వెంట ఉంటాడు. కానీ ఈ సినిమా ప్రారంభోత్వంలో మాత్రం ఎక్కడా కనిపించలేదు.
ఏంటా అని ఆరా తీస్తే ఆసక్తికర సంగతులే బయటకు వస్తున్నాయి. ఆ దర్శకుడికి హీరో మంచి స్నేహితుడే అయినా...ఆ స్నేహితుడు సినిమా నిర్మిస్తోన్ననిర్మాణ సంస్థతో చిన్నచిన్నపొరపొచ్చాలున్నట్లు వెలుగులోకి వచ్చింది. అందరితో పాటు సదరు నిర్మాణ సంస్థ ఆ డైరెక్టర్ కి ఆహ్వాన పత్రిక పంపిందిట. కానీ ఆయన మాత్రం కావాలనే హాజరు కాలేదని తెలిసింది.
గతంలో ఆ సంస్థతో ఎదురైన ఓచేదు అనుభవం కారణంగానే దూరంగా ఉన్నట్లు సమాచారం. తన ప్రాణ స్నేహితుడు పిలిచినా సరే సారీ చెప్పేసాడు అంట . ఇంతకీ ఆ డైరెక్టర్ ..నిర్మాణ సంస్థ మద్య ఉన్న ఇబ్బంది ఏంటి? అంటే! గతంలో ఆ దర్శకుడికి సదరు నిర్మాణ సంస్థ సినిమా చేయమని కొంత అడ్వాన్స్ ఇచ్చిందిట. కానీ దర్శకుడు బిజీ షెడ్యూల్ సహా ..ఇతర సంస్థలతో టై అప్ అవ్వడంతో సినిమా చేయడం కుదర్లేదుట.
దీంతో అడ్వాన్స్ ఇచ్చిన సంస్థ మొత్తం తిరిగి వడ్డీతోపాటు వసూల్ చేసిందిట. అసలు అడిగితే పర్వాలేదు. ఇలా ఉదయం లేస్తే ముఖ ముఖాలు చూసుకునే వారు వడ్డీ కూడా అడిగేసరికి దర్శకుడు బాగా ఫీలయ్యాడుట.
అప్పటి నుంచి ఆ సంస్థకి దూరంగానే ఉంటున్నాడుట. ఇలా ఆ డైరెక్టర్ లాంచింగ్ ని స్కిప్ కొట్టినట్లు తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.