ఏడాది ఆరంభంలోనే పాన్ ఇండియా చిత్రాలు `పుష్ప ది రైజ్`..`ఆర్ ఆర్ ఆర్`..`కేజీఎఫ్` లాంటి చిత్రాలు ప్రేక్షకులకు బిగ్ ట్రీట్ ఇచ్చేసాయి. చరణ్..తారక్..బన్నీ పాన్ ఇండియా హీరోలైపోయారు. ఆ ఇమేజ్ ని కాపాడుకోవడమే వాళ్ల ముందున్న లక్ష్యం. `రాధేశ్యామ్` భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా వాటిని అందుకోవడంలో విఫలమైంది. డార్లింగ్ ప్రభాస్ కి `సాహో` తర్వాత మరో పాన్ ఇండియా పరాజయం. ఇప్పుడా లెక్కలన్నింటిని ప్రభాస్ `సలార్` తో సరిచేయాల్సి ఉంది.
ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన `ఆచార్య` ఇటీవలే రిలీజ్ అయిన మరో చేదు అనుభవాన్ని మిగిల్చింది. చిరు కెరీర్ లో మర్చిపోలేని ఫెయిల్యూర్ ఇది. ఇక మే 12న సూపర్ స్టార్ మహేష్ నటించిన `సర్కారు వారి పాట` రిలీజ్ అవుతుంది. ఇంకా ఇదే నెలలో కొన్ని మీడియం రేంజ్ హీరోల సినిమాలు రిలీజ్ కి ఉన్నాయి. ఇలా మొదటి ఐదు నెలలు గడిచిపోయింది.
ఇక జూన్ లో `విక్రమ్`..`అంటే సుందరానికీ`..`రామారావు ఆన్ డ్యూటీ` లాంటి చిత్రాలున్నాయి. జులైలో `పక్కా కమర్శియ ల్`..`విరాటపర్వం`..`మాచర్ల నియోజక వర్గం`..`ది వారియర్`..అటుపై నెలలో `కార్తికేయ-2`..`లైగర్` లాంటి సినిమాలున్నాయి. ఆ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలైతే ఇప్పటివరకూ రిలీజ్ కి లేవు.
`రావణాసుర`..`హరి హర వీరమల్లు`..`ఆది పురుష్`..`జేజీఎమ్`..`భోళా శంకర్`.. `గాడ్ ఫాదర్`..`బాలయ్య 107వ సినిమా`..`సలార్` లాంటి సినిమాలు సెట్స్ లో ఉన్నా అవి ఈ ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం లేదు. మహేష్ త్రివిక్రమ్ సినిమా ఇంకా సెట్స్ కి వెళ్లలేదు. అలాగే `పుష్ప-2` షూటింగ్ ప్రారంభం కాలేదు. తారక్-కొరటాల మొదలు పెట్టలేదు.
అంటే సినిమా రిలీజ్ జాతర ఆగస్టు తో దాదాపు ముగిసినట్లే. ఆ తర్వాత అగ్ర హీరోలెవరూ థియేటర్లోకి వచ్చే అవకాశం లేదని సష్టంగా తెలుస్తోంది. దీంతో చిన్నా చితకా హీరోల సినిమాలకు అది సరైన సమయంగా చెప్పొచు. ఆగస్టు లోపు డేట్లు ప్రకటించిన సినిమాలు అనివార్య కారణాల వల్ల రిలీజ్ చేయలేకపోతే అటుపై సరైన రిలీజ్ తేదీలు దొరికే అవకాశం ఉంది.
అయితే బాలయ్య 107వ సినిమా మాత్రం డిసెంబర్ లోపు రిలీజ్ కి ఆస్కారం ఉందని భొగొట్టా. అయినా బాలయ్య దసరాకో...క్రిస్టమస్ కో ప్లాన్ చేసుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి బాలయ్య చిన్న హీరోలకి పోటీగా దిగరు. మారుతి `డీలక్స్ రాజా` గనుక మొదలు పెడితే డిసెంబర్ లోపు రిలీజ్ చేసే అవకాశాలున్నాయని నిర్మాణ వర్గాల సమాచారం.
ఇది భారీ బడ్జెట్ సినిమా కాదు. పాన్ ఇండియా కేటగిరి కాదు. మారుతి మార్క్ ఎంటర్ టైనర్ గా ప్రభాస్ తో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. `సాహో`..రాధేశ్యామ్ ప్లాప్ ల పరంపరకు `డీలక్స్ రాజా`తోనే వీలైనంత త్వరగా బ్రేక్ వేయాలనే ఉద్దేశంతోనే యంగ్ మేకర్ ని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే డీలక్స్ రాజాని డిసెంబర్ లోపు దించేసే అవకాశం ఉందని అంటున్నారు.