ముంబై జుహూ ప్రాంతంలో సీ-వ్యూ ఫ్లాట్ అమ్మకానికి ఉందంటే ఎవరైనా ఎగరేసుకుని పోతారు. కానీ ఆ ప్రముఖ హీరోయిన్ ఫ్లాట్ చాలా కాలంగా అమ్మకానికి ఉన్నా ఎవరూ కొనడం లేదు. ఆ ఫ్లాట్ మాటెత్తితేనే ఝడుసుకు చస్తున్నారు. ఇంతకీ ఏమైంది? అంటే వివరాల్లోకి వెళ్లాలి.
దివంగత బాలీవుడ్ నటి పర్వీన్ బాబీ జుహులో సముద్రానికి ఎదురుగా ఉన్న ఫ్లాట్ అమ్మకానికి లేదా అద్దెకు ఉంది. ఆశ్చర్యకరంగా ఈ ఫ్లాట్ కు ఇప్పటివరకు కొనుగోలుదారులు ఎవరూ రాలేదు. కారణం వింతగా అనిపిస్తుంది. పర్వీన్ బాబీ 17 సంవత్సరాల క్రితం20 జనవరి 2005న తీవ్రమైన స్కిజోఫ్రెనియాతో బాధపడుతూ.. అవయవ వైఫల్యంతో బాధపడుతూ తన ఫ్లాట్ లో మరణించింది. ముంబై జుహూలోని రివేరా బిల్డింగ్ లోని 7వ అంతస్తులో ఉన్న తన అపార్ట్ మెంట్ లో 4 రోజుల తర్వాత ఆమె శవమై కనిపించింది.
కొనుగోలుదారులెవరూ రాకపోవడానికి గల కారణం అది పర్వీన్ బాబీ ఫ్లాట్ కావడం.. వారు దానిని గ్రహించినప్పుడు విచిత్రంగా అనిపించడం. పర్వాన్ బాబీ సహజ మరణంతో మరణించినప్పటికీ ఆమె మరణించిన నాలుగు రోజుల తర్వాత రివేరా ఫ్లాట్ లో కనిపించిందనే ఆలోచనతో ప్రజలు దానిలోకి వెళ్లాలంటేనే అసౌకర్యానికి గురవుతున్నారని పుకారు ఉంది. మరణించిన ఆత్మల కథలతో కనెక్టయిపోతున్నారట.
తాజా సమాచారం మేరకు.. ఫ్లాట్ నెలకు రూ. 4 లక్షలకు అద్దెకు లేదా రూ. 15 కోట్లకు అమ్మకానికి సిద్ధంగా ఉంది. 2014లో పర్వీన్ బాబీ ఫ్లాట్ లో అద్దెదారు ఉన్నాడు.యు ఆ ఫ్లాట్ ను వాణిజ్య అవసరాలకు ఉపయోగించాడనే ఆరోపణతో ఆ వ్యక్తి స్వయంగా వదిలి వెళ్లాడు. ఆ తర్వాత ఎవరూ ఆ ఫ్లాట్ కి అద్దెకు రావడం లేదు. కొనుగోలుకు రావడంలేదు. ఎప్పటికీ అలానే ఖాళీగా ఉండిపోయింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.