స్వీడన్లో ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 6 వరకు ఫిల్మ్ ఫెస్టివెల్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి ఫిల్మ్ ఫెస్టివల్ కాస్త విభిన్నంగా సాగనున్నట్టు సమాచారం. మామూలుగా ఫిల్మ్ ఫెస్టివల్ అంటే.. సినిమా హీరోలు, నిర్మాతలు, దర్శకులు, టెక్నికల్ సిబ్బందితో హడావుడిగా ఉంటుంది. కానీ ఈ సారి కరోనా నేపథ్యంలో కాస్త విభిన్నంగా ఫిల్మ్ ఫెస్టివల్ సాగనున్నది. సినిమాలు ప్రదర్శిస్తారు. కానీ అక్కడ కేవలం ఒక్కరు మాత్రమే కూర్చొని చూడాలి. మధ్యమధ్యలో ఆ సినిమాకు చెందిన దర్శకులు, ఆర్టిస్టులు ఆన్లైన్ లైవ్‌లో మీతో మాట్లాడతారు. అయితే సినిమాకు చూసే ప్రేక్షకులను ఫిల్మ్ ఫెస్టివల్ నిర్మాతలు ఎంపిక చేస్తారు.
స్వీడన్‌లోని ఎర్తెబోజియేలో ఈ ఏడాది ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏడాది ఉత్సవాలన్నీ ఎర్తెబోజియేకు సమీపంలోని పేటర్ నోస్టర్ అనే దీవిలో సినిమాల స్క్రినింగ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 60 చిత్రాలను ఇక్కడ ప్రదర్శించనున్నారు. అయితే ఈ ఏడాది సినిమాలు ప్రదర్శిస్తారు కానీ ప్రేక్షకులు ఉండరు.. కానీ స్క్రీన్‌కి ఒక్క ప్రేక్షకుడిని అనుమతించారు. ఈ సినిమాలను చూసే వాళ్లను కూడా ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు ఎంపికచేయనున్నారు.
వాళ్లు ఒక వారం రోజుల పాటు తమ బంధువులు. చుట్టాలను వదిలిపెట్టి.. మొబైల్ ఫోన్లను వదిలిపెట్టి ఇక్కడ సినిమా చూడాల్సి ఉంటుంది. మామూలుగా ఫిల్మ్ ఫెస్టివల్స్ అంటే గందరగోళంగా, హడావుడిగా ఉంటుంది. ఇక్కడికి ప్రదర్శించే సినిమాలు, ఆహ్వానితులుగా ఎంపికైన సినిమా టెక్నిషియన్స్ అందరికీ ప్రత్యే గుర్తింపు ఉంటుంది. కానీ ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా చిత్రోత్సవాలు జరుగుతున్నాయి. కేవలం ఆహ్వానితులంతా ఆన్లైన్లోనే పాల్గొనాలి. చిత్రాలను ప్రదర్శిస్తారు. కానీ ఒక్క షో కు ఒక్క ప్రేక్షకుడిని మాత్రమే ఎంపిక చేస్తారు. కరోనా ఎఫెక్ట్ తో ఇలా ఐసోలేటెడ్ థియేటర్లను ఏర్పాటు చేశారు.