కింగ్ నాగార్జున కొత్త ఏడాదిని గ్రాండ్ గా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. నాగార్జున కథానాయకుడిగా నటించిన `బంగార్రాజు` సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ ని ఏడాది ఆరంభంలోనే ఖాతాలో వేసుకున్నారు. ఆ సక్సెస్ లో తనయుడు నాగచైతన్య సైతం భాగం కావడంతో నాగ్ ఆనంధానికి అవధులు లేవు.
ఇక కొత్త ప్రాజెక్ట్ ల విషయంలోనాగార్జున వేగం పెంచుతున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త చిత్రాల్ని పట్టాలెక్కిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో `ది ఘోస్ట్ ` అనే చిత్రాన్ని ఇటీవలే సెట్స్ పైకి తీసుకెళ్లారు.
ఇప్పటికే హైదరాబాద్ లో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ పూర్తిచేసిన యూనిట్ తాజాగా దుబాయ్ షెడ్యూల్ లో బిజీగా ఉంది. యూనిట్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి. దుబాయ్ ఓ షిప్‌లో నాగార్జునతో పాటు దర్శకుడు ప్రవీణ్.. హీరోయిన్ సోనాల్ చౌహాన్ కలిసి దిగిన ఫోటోలు ట్విట్టర్‌లో సందడి చేస్తున్నాయి. ఇక వైట్ కలర్ షట్‌లో నాగార్జున సరికొత్త లుక్ ఆకట్టుకున్నారు.
తాజాగా ప్రవీణ సత్తారు తన ట్విటర్ ఖాతా నుంచి ఓ ఫోటోని షేర్ చేసారు. చిత్రీకరణ లో భాగంగా సరిగ్గా నడినెత్తున సూర్యుడి భగభగల సమయంలో దుబాయ్ ఎండల్ని క్యాప్చర్ చేస్తూ ఓ ఫోటోని తీసారు. నేలపై ఎర్రటి ఇసుక..భానుడి మండే భగ భగల నడుమ ఎండ తీవ్రత ఎలా ఉందనే సందర్భం హైలైట్ అవుతుంది. అంత తీవ్రమైన ఎండలో `ది ఘోస్ట్`` చిత్రీకరణ జరుపుతున్నారు. `ది ఘోస్ట్` దుబాయ్ డైరీస్ పేరిట వీటిని నెట్టింట వైరల్ చేస్తున్నారు.
ఇక దుబాయ్ లో ఎండ తీవ్రత గురించి చెప్పాల్సిన పనిలేదు. తీవ్రమైన ఎండలు..వడగాల్పులు అక్కడ చాలా సహజం. అదీ సీజన్ లో ఎండ తీవ్రత చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో అన్ని రకాల రక్షణతో అక్కడి ప్రజలు బయటకు వెళ్తుంటారు.
సరిగ్గా ఇదే సీజన్ ని `ది ఘోస్ట్ `చిత్రీకరణ ప్రారంభించడం సాహసోపేతమైన నిర్ణయమే.
ఇక నాగార్జున బాలీవుడ్ లో `బ్రహ్మస్ర్త`లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమా సెట్స్ లో ఉంది. దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత కింగ్ మళ్లీ బాలీవుడ్ లో నటిస్తున్నారు. ఇక బుల్లి తెరపైనా నాగార్జున హోస్ట్ బాధ్యతలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.