సన్నీలియోన్ పాటతో వధువు ఎంట్రీ.. స్టన్ అయిన వరుడు

Update: 2020-12-05 15:44 GMT
పెళ్లి అంటే నూరేళ్ల పంట. అందుకే ఇప్పుడు పెళ్లిళ్లు చాలా ఖర్చుతో చేసుకుంటున్నారు. ఎంతైనా సరే గ్రాండ్ గా చూసుకుంటున్నారు. ఇక వరుడు, వధువు కూడా లక్షలు పోసి రెడీ అవుతున్నారు. ఆ లుక్ తెచ్చుకుంటున్నారు.

ఒకప్పుడు వధువు, వరుడు చూసుకోవడానికే సిగ్గుపడేవారు. ఇప్పుడు పెళ్లికి ముందే ప్రీవెడ్డింగ్ అంటూ నగ్నంగా ఫొటో షూట్ లు చేసుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్రలోనూ పెళ్లిలో ఓ వధువు అందరికీ షాకిచ్చింది. సిగ్గుపడుతూ తల కిందకు దించుకొని వస్తుందని అందరూ భావించగా అదిరిపోయేలా ఎంట్రీ ఇచ్చింది.

సిగ్గు పడడం మానేసి సదురు పెళ్లి కూతురు ఏకంగా సన్నీలియోన్ పాట వేసుకొని డ్యాన్స్ చేస్తూ పెళ్లి మండపానికి రావడం విశేషం. పెళ్లికూతురు వీర లెవల్లో రెచ్చిపోయి డ్యాన్స్ చేస్తుంటే స్టన్ అయిపోయిన పెళ్లికొడుకు వేదికపై అలా కళ్లప్పగించి చూస్తుండిపోయాడు. ఈ ఉదంతం మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

మహారాష్ట్రలో ఓ వధువు సన్నీలియోన్ ‘మేరే సైయాన్ సూపర్ స్టార్ క్రేజీ’ పాటకు చిందులేసింది. మరాఠి సంప్రదాయం ప్రకారం రెడీ అయ్యి సన్ గ్లాసెస్ పెట్టుకొని గ్రాండ్ గా మండపంలోకి ఎంట్రీ ఇచ్చింది. డ్యాన్స్ చేస్తూ వేదికపైకి వచ్చింది.

ఈ హఠాత్ పరిణామానికి పెళ్లికి హాజరైన బంధువులంతా ఆశ్చర్యపోగా.. పెళ్లి కొడుకు సైతం కొద్దిసేపు అలా స్టన్ అయిపోయాడు.తరువాత తేరుకొని పెళ్లికూతురుకు ముద్దు ఇచ్చి వేదికపైకి తీసుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : https://twitter.com/praveengavit10/status/1334112082942279681?s=20
Tags:    

Similar News