కథ నచ్చకపోతే ఖాళీగా ఇంట్లో కూర్చుంటాను

Update: 2021-04-03 10:30 GMT
కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను మంచి ఫాలోయింగ్ ఉన్న అతికొద్ది మంది హీరోల్లో కార్తి ఒకరు. మొదటి నుంచి కూడా కార్తి వైవిధ్యభరితమైన కథలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. అలా ఆయన చేసిన సినిమానే 'సుల్తాన్'. నిన్ననే ఈ సినిమా తమిళనాటతో పాటు తెలుగులోనూ విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో రన్ అవుతోంది. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా రష్మిక అలరించింది. తాజా ఇంటర్వ్యూలో .. ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ గురించి కార్తి ప్రస్తావించాడు.

'సుల్తాన్' లాక్ డౌన్ తరువాత వచ్చిన నా సినిమా .. థియేటర్లో సినిమా చూసిన తరువాత చాలా హ్యాపీగా అనిపించింది. ఎన్నో రోజుల తరువాత లైఫ్ కొత్తగా స్టార్టు అయినట్టుగా .. సెలబ్రేషన్ జరుగుతున్నట్టుగా ఉంది. ఈ సినిమాలో తెరపై చాలా పాత్రలు కనిపిస్తాయి .. ప్రతి పాత్రకు ప్రత్యేకత ఉంటుంది. విలేజ్ వాతావరణంలో 70 రోజుల పాటు షూటింగు జరిపాము. షూటింగుకి కేవలం ఆర్టిస్టులు మాత్రమే 10 బస్సుల్లో వచ్చేవారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. తొలిరోజున నేను షూటింగుకి వెళ్లినప్పుడు జాతరలా అనిపించింది.

కోలీవుడ్ కి నేను మామూలు హీరోగా పరిచయం కాలేదు .. నా మొదటి సినిమా చూస్తే డిఫరెంట్ కంటెంట్ తో ఉంటుంది. అప్పటి నుంచి నేను అదే పద్ధతిని ఫాలో అవుతూ వస్తున్నాను. అందువల్లనే ఇంతటి లాంగ్ రన్నింగ్ లో నేను కేవలం 20 సినిమాలకి పైగా మాత్రమే చేయగలిగాను. కథలు నచ్చకపోతే ఖాళీగా ఇంట్లో కూర్చుంటానుగానీ .. కాంప్రమైజ్ మాత్రం కాలేను. తెలుగులో నేరుగా ఒక సినిమా చేయవచ్చును గదా అని చాలామంది అడుగుతున్నారు. సరైన ఆఫర్ రాకపోవడమే తప్ప మరో కారణం లేదు. తెలుగులో 'మనం' మాదిరిగా మా కుటుంబ సభ్యులంతా కలిసి ఒక సినిమాలో చేయాలనుంది .. తగిన కథ దొరికితే ఈ కోరిక నెరవేరే అవకాశం ఉంది" అని చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News