ఆ డిజాస్ట‌ర్ తో పారితోషికం స‌గం త‌గ్గించిన హీరో!

Update: 2022-09-01 04:48 GMT
ప్రతి శుక్రవారం బాక్సాఫీస్ వద్ద కొత్త కథ తెర‌పైకొస్తుంది. ఆ రోజు  హీరోల‌ ఫేట్ తారుమారు అవుతుంటుంది. మహమ్మారికి ముందు మ‌హ‌మ్మారీ త‌ర్వాతా బాలీవుడ్ హీరోల స‌న్నివేశం అమాంతం మారిపోయింది. ఇప్పుడు చాలా మంది హీరోలు పారితోషికాలు వెన‌క్కిస్తున్నారు. కొంద‌రు అయితే స‌గానికి స‌గం త‌గ్గించుకుంటున్నారు. తాజా స‌మాచారం మేర‌కు ట్యాలెంటెడ్ టైగ‌ర్ ష్రాఫ్ స‌గం పారితోషికం త‌గ్గించుకున్నాడ‌ని తెలిసింది.

మ‌హ‌మ్మారీ ముందు టైగర్ ష్రాఫ్ దాదాపు 30 కోట్ల పారితోషికం అందుకునేవాడు. కానీ అది ఇప్పుడు 17కోట్ల‌కు ప‌డిపోయింది. మహమ్మారి అనంతర కాలంలో టైగ‌ర్ తన ప్రేక్షకులను కోల్పోయాడు.. థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు.. అందుకే ఈ నిర్ణ‌యం అని ఒక సోర్స్ వెల్ల‌డించింది.

హీరోపంథి 2 విడుదలకు ముందే టైగర్ ష్రాఫ్ తన పారితోషికాన్ని అమాంతం పెంచి చిత్రాలకు సంతకం చేశాడు.' గణపథ్' చిత్రానికి రూ. 35 కోట్లు .. బడే మియాన్ చోటే మియాన్ కోసం రూ. 45 కోట్లు పారితోషికం కోట్ చేశాడు. కరణ్ జోహార్ 'స్క్రూ ధీలా' కోసం రూ. 35 కోట్లకు సంత‌కం చేసేశాడు. కానీ అనూహ్యంగా 'హీరోపంతి 2' పరాజయం తర్వాత, టైగర్ ష్రాఫ్ తన ఫీజులను 50 శాతం తగ్గించి రూ. 17-20 కోట్లకు ఫిక్స‌వుతున్నాడ‌ని స‌మాచారం.

ఇప్పుడు టైగర్ ష్రాఫ్ తన పారితోషికాన్ని 50 శాతం తగ్గించి ఒక్కో సినిమాకు 17 నుంచి 20 కోట్లు రేంజ్ లో చెల్లించేలా ఒప్పందాల‌ను మార్చార‌ని తెలిసింది. కాలం చాలా మారింది. టైగర్ కి ముందస్తు భారీ ఫీజు చెల్లించడం ఎలానో చాలా మంది నిర్మాతలకు అర్థం కాలేదు... అని గుస‌గుస వినిపిస్తోంది.

ఒక భారీ మ‌ల్టీస్టార‌ర్ కోసం జాకీ ష్రాఫ్‌- వాషు భగ్నానీ స‌మ‌ర్ప‌కులుగా ఉన్నారు.  కానీ ఆ మూవీకి టైగర్ ష్రాఫ్ తన నటనా రుసుమును రూ. 25 కోట్లకు తగ్గించాడు. అంతేకాదు.. ఇదే మ‌ల్టీస్టార‌ర్ లో న‌టిస్తున్న‌ అక్షయ్ కుమార్ .. ద‌ర్శ‌కుడు అలీ అబ్బాస్ జాఫర్ కూడా తమ ఫీజులను తగ్గించుకున్నారు. చాలా మంది నిర్మాతలు అతను డిమాండ్ చేస్తున్న మొత్తానికి అంగీక‌రించేందుకు సిద్ధంగా లేనందున టైగ‌ర్ వ‌రుస‌ సినిమాలపై సంతకం చేసే ప్రక్రియ మందగించింది అని ట్రేడ్ సోర్స్ విశ్లేషించింది.

టైగర్ తో చర్చలు జరుపుతున్న మరికొందరు నిర్మాతలు కూడా అతని పారితోషికం పై చర్చిస్తున్నారు.. భ‌య‌ప‌డుతున్నారు. ఇది రూ. 17 నుంచి 22 కోట్లు వ‌ర‌కూ ఫ‌ర్వాలేద‌ని విశ్లేషిస్తున్నారు. కానీ ఇది స్వల్పకాలిక ప్ర‌ణాళిక‌. ఒక్క హిట్ కొడితే టైగర్ మళ్లీ గర్జిస్తుంది. కానీ 'టైగర్' జిందా హై అని ఇండస్ట్రీ గుర్తించడానికి చాలా సమయం పడుతుంది. ఇది టైగర్ కే కాదు.. మొత్తం పరిశ్రమకు సంక్లిష్ట‌మైన‌ ఫేజ్. సినిమాలు బాగా ఆడ‌టం ప్రారంభించిన తర్వాత సాధారణ స్థితికి చేరుకుంటే అప్పుడు పారితోషికాలు పెంచుకోవచ్చు! అని ట్రేడ్ సోర్స్ వెల్ల‌డించింది. మ‌రోవైపు టైగర్ త్వ‌ర‌లోనే 'బడే మియాన్ చోటే మియాన్' షూటింగ్ ను ప్రారంభించనున్నాడని స‌మాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News