గుస‌గుస‌: మాజీ ముఖ్య‌మంత్రి జీవితంలో మ‌ధూద‌యం!

Update: 2021-07-13 17:30 GMT
`రోజా`లాంటి కల్ట్ క్లాసిక్ సినిమాతో నాయికగా అంద‌రి గుండెల్ని ట‌చ్ చేశారు మ‌ధుబాల‌. గొప్ప న‌టిగా నృత్య‌కారిణిగా.. చ‌క్క‌ని న‌ట‌న హావ‌భావాల‌తో అల‌రించే నాయిక‌గా పాపుల‌ర‌య్యారు. మ‌ధూ త‌మిళం-తెలుగులో ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో న‌టించారు. చాలా గ్యాప్ త‌ర్వాత `అంత‌కుముందు ఆ త‌ర‌వాత` చిత్రంతో టాలీవుడ్ లో త‌న కెరీర్ సెకండ్ ఇన్సింగ్స్ ని ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం మ‌ధుబాల స‌హాయ‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఏ.ఎల్.విజ‌య్ తెర‌కెక్కిస్తున్న `త‌లైవి` చిత్రంలో మాజీ సిఎం ఎంజీఆర్ భార్యగా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అరవింద్ స్వామి స‌ర‌స‌న‌ మణిరత్నం `రోజా` లో నటించినప్పటి మధు ఇప్పుడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎం.జి.రామచంద్రన్ (అర‌వింద స్వామి) భార్య‌గా న‌టించ‌డం పై అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. దివంగత జానకి రామచంద్రన్ పాత్ర‌తో మ‌ధూ అభిమానుల్ని అల‌రించ‌నున్నారు.

త‌లైవిలో కంగ‌న టైటిల్ రోల్ పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. అమ్మ జ‌య‌ల‌లిత జీవితంలో వివిధ ద‌శ‌ల‌ను ఈ చిత్రం తెర‌పై ఆవిష్క‌రించ‌నుంది. జ‌య‌ల‌లిత బాల్యం.. క‌థానాయిక‌గా ఆరంగేట్రం.. అగ్ర నాయిక హోదా.. రాజ‌కీయాల్లో ఆరంగేట్రం .. ఆరుసార్లు సీఎం అయ్యాక జ‌రిగిన ప‌రిణామాలు వ‌గైరా వ‌గైరా `త‌లైవి` చిత్రంలో చూపించ‌నున్నారు. ఈ మూవీలో క‌రుణానిధి వ‌ర్సెస్ జ‌య‌ల‌లిత‌ ఎపిసోడ్ల‌ను ఏ కోణంలో చూపించ‌బోతున్నారు? అన్న‌ది కూడా ఆస‌క్తిక‌రం.

మధూ కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. 2020 లో `కాలేజ్ కుమార్` అనే మూవీలో న‌టించారు. త‌లైవి మ‌రో నెల‌లో విడుద‌ల కావాల్సి ఉంది.  ఈ మూవీ గురించి మాధూ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని తాజా చిట్ చాట్ లో వెల్ల‌డించారు. ``త‌లైవి చిత్రీక‌ర‌ణ చాలా బాగా కుదిరింది. త్వ‌ర‌లోనే విడుద‌ల కానున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. దురదృష్టవశాత్తు కరోనావైరస్ రెండవ వేవ్ మార్చి 2021 లో తిరిగి ప‌రిశ్ర‌మ‌ను తాకింది. కాబట్టి ఈ చిత్రం విడుదల కాకూడదని మేమంతా భావించడంతో మేకర్స్ వాయిదా వేశారు. ఇంత బాగా తెర‌కెక్కిన మూవీని సినిమా హాళ్ల‌లో చూసే అవ‌కాశం గొప్ప అదృష్టం. ఆ అవకాశానికి అర్హురాలిని అని నేను భావిస్తున్నాను. ఒక సినిమా విధి రాత‌ మన చేతుల్లో లేదు.. కానీ మంచి చిత్రం ప్రతి ఒక్కరూ చూడటానికి అర్హమైనది.. అని అన్నారు.

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంతి మేటి క్లాసిక్ నాయిక జయలలిత బ‌యోపిక్ గా చెబుతున్న త‌లైవి తెలుగు-త‌మిళం- హిందీలో అత్యంత భారీగా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితిలో రిలీజ్ తేదీపై డైల‌మా కొన‌సాగుతోంది. సెకండ్ వేవ్ ఊహించ‌ని ప‌రిణామంగా మారడంతో వేస‌వి రిలీజ్ చేయ‌డం సాధ్య‌ప‌డ‌లేదు. అప్ప‌ట్లోనే నిర‌వ‌ధిక‌ వాయిదాని ప్ర‌క‌టించారు. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ఈ చిత్రంలో ఎంజీఆర్ పాత్ర‌లో అర‌వింద స్వామి న‌ట‌న హైలైట్ గా ఉండ‌నుంద‌ని అత‌డితో పోటీప‌డుతూ జ‌య‌ల‌లిత పాత్ర‌ధారి కంగ‌న న‌టించార‌ని ఇండ‌స్ట్రీ ఇన్ సైడ్ గుస‌గుస‌లు లీక‌య్యాయి. నాన్న ఫేం ఎఎల్ విజయ్ ఈ మూవీకి దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ మంచి స్పందన అందుకుంది.

 విష్ణు ఇందూరి- శైలేష్ ఆర్ సింగ్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. తెలుగు-త‌మిళం-హిందీ స‌హా ప‌లు భాష‌ల్లో పాన్ ఇండియా కేట‌గిరీలో అత్యంత భారీగా ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇంత‌కుముందు ఎన్టీఆర్ బ‌యోపిక్ ని నిర్మించిన విష్ణు ఇందూరి అమ్మ బ‌యోపిక్ ని ఛాలెంజింగ్ గా భావించి భారీ పెట్టుబ‌డుల్ని స‌మ‌కూర్చారు. ఎన్టీఆర్ బ‌యోపిక్ బాక్సాఫీస్ వ‌ద్ద విఫ‌ల‌మైనా.. త‌లైవి విజయంపై ఆయ‌న పూర్తి న‌మ్మ‌కంతో ఉన్నార‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News