స్పెషల్ స్టోరీ: టాలీవుడ్ కు ప్రధాన స్తంభాలుగా నిలిచిన హీరోలు..!

Update: 2021-04-01 06:30 GMT
తెలుగు చిత్ర పరిశ్రమలో తరానికి నలుగురైదుగురు స్టార్ హీరోలు మెయిన్ పిల్లర్స్ గా నిలబడుతూ వచ్చారు. అప్పట్లో నందమూరి తారకరామారావు - అక్కినేని నాగేశ్వరరావు - కృష్ణ - శోభన్ బాబు - కృష్ణంరాజులు తెలుగు సినిమా ఖ్యాతిని చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశారు. తెలుగు సినిమా చరిత్రలో తమకంటూ ప్రత్యేకమైన అధ్యాయాన్ని లిఖించుకున్నారు. వీరిని అనుసరిస్తూ ఆ తర్వాతి జనరేషన్ లో వచ్చిన హీరోలలో మెగాస్టార్ చిరంజీవి - కింగ్ అక్కినేని నాగార్జున - విక్టరీ వెంకటేష్ - నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీకి నాలుగు ప్రధాన స్తంభాలుగా నిలబడ్డారు. వీరిలో చిరంజీవి ఒక్కడే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఆ స్థాయికి రాగా.. మిగతా ముగ్గురు నటవారసులుగా వచ్చిన వారే. మూడు దశాబ్దాలుగా టాలీవుడ్ ని ఏలుతున్న ఈ నలుగురు సీనియర్ స్టార్ హీరోలు ఈ నేటితరం హీరోలకు కూడా పోటీగా నిలుస్తున్నారు.

ఇక టాలీవుడ్ లో ప్రెజెంట్ జనరేషన్ విషయానికొస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సూపర్ స్టార్ట్ మహేష్ బాబు - యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లు ఇండస్ట్రీలో హవా చూపిస్తున్నారు. అయితే వీరందరూ కూడా నెపోటిజం హీరోలే కావడం గమనార్హం. కాకపోతే ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో వచ్చినప్పటికీ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి బాగానే కష్టపడ్డారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రధాన పోటీ వీరి సినిమాల మధ్యనే ఉంటోంది. అయితే ఒకప్పుడు తెలుగు సినిమా అంటే రీజనల్ మూవీగానే చూసేవారు.. కానీ ఈ తరం హీరోలు వచ్చిన తర్వాత తెలుగు సినిమా మార్కెట్ పాన్ ఇండియా స్థాయిలో విస్తరింపజేశారు. దీంతో మిగతా ఇండస్ట్రీల వారు కూడా మన సినిమా వైపు చూసే పరిస్థితి వచ్చింది. అందుకే దీనిని కాపాడుకుంటూ అందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు వచ్చిన యంగ్ స్టర్స్ కూడా వీరికి తోడుగా నిలుస్తూ తమవంతు కృషి చేస్తున్నారు. ప్రస్తుతమున్న యువ హీరోల్లో ఇండస్ట్రీకి ప్రధాన స్తంభాలుగా మారగలిగే సత్తా ఉన్న వారిని మునుముందు చూడబోతున్నాం..!
Tags:    

Similar News