సిద్దార్థ్ ని భయం కాపాడుతుందా?

Update: 2017-10-02 16:19 GMT
అప్పట్లో మంచి లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకొని తనదైన శైలిలో సినిమాలను తీసిన నటుడు సిద్దార్థ్. అప్పుడు తమిళ్ - తెలుగులో గ్యాప్ లేకుండా సినిమాలను తీసేవాడు. ప్రస్తుతం తమిళ్ లో బాగానే సినిమాను చేస్తున్నాడు. కానీ తెలుగులో మాత్రం ఏ సినిమాలను చెయ్యడం లేదు. చివరగా 2013 లో జబర్దస్త్ అనే సినిమాను తీశాడు. అలాగే ఎన్టీఆర్ బాద్షా లో కూడా గెస్ట్ రోల్ లో కనిపించిన సంగతి తెలిసిందే.

ఇక అప్పుడప్పుడు తమిళ్ డబ్బింగ్ సినిమాలతో వచ్చినా అంతగా ఎవరూ పట్టించుకునేవారు కాదు. దీంతో ఈ సారి ఎలాగైనా మళ్లీ టాలీవుడ్ లో తన గత వైభవాన్ని చూపెట్టాలని చూస్తున్నాడు. ఒక హర్రర్ కథని ఒకే సారి మూడు భాషల్లో తెరకెక్కిస్తున్నాడు. ది హౌస్ నెక్స్ట్ డోర్ అనే ఆ సినిమాను ఒకేసారి  హిందీ - తెలుగు - తమిళ్ లో రూపొందిస్తున్నారు. మిలింద్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో సిద్దార్థ్ కి జోడిగా ఆండ్రియా జెరీమియా నటిస్తోంది.

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే సిద్దార్థ్ ఈ సినిమాను ఎటాకీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించి టీజర్ ని రిలీజ్ చేసే ఆలోచనలో సిద్దార్థ్ ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి హర్రర్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమా కోసం సిద్దార్థ్ భారీగానే ఖర్చు చేస్తున్నాడట. మరి ఆ సినిమా ఎంతవరకు విజయాన్ని అందుకుంటుందో చూడాలి.     
Tags:    

Similar News