'సీతారామం' జర్నీ ఇలా సాగింది

Update: 2022-08-19 05:57 GMT
దుల్కర్ సల్మాన్‌ హీరోగా మృనాల్ ఠాకూర్‌ హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొంది ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీతారామం సినిమా కు మంచి స్పందన దక్కింది. బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే ఈ సినిమా రూ.50 కోట్ల వసూళ్లను క్రాస్ చేసింది. మూడవ వారంలో కూడా సినిమా వసూళ్లు నిలకడగా ఉన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం కూడా సింపుల్ గా స్వీట్ గా దర్శకుడు హను చూపించే ప్రయత్నం చేశాడు. కశ్మీర్ మంచు కొండలు మొదలుకుని ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలను సినిమాలో చక్కగా దర్శకుడు చూపించడంలో సఫలం అయ్యాడు. షూటింగ్ సమయంలో ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులను మరియు వివిధ లొకేషన్స్ కు సంబంధించిన విషయాలను తాజా వీడియోలో యూనిట్‌ సభ్యులు చూపించారు.

కేవలం నిమిషం వీడియోలో సినిమాలోని కీలకమైన లొకేషన్స్‌ ను.. ఆ లొకేషన్స్ లో షూటింగ్ చేసిన విధానం ను చూపించే ప్రయత్నం చేశారు. మేకింగ్ వీడియో తో సినిమా కోసం యూనిట్‌ సభ్యులు ఎంతగా కష్టపడ్డారో అర్థం అవుతుంది. మైనస్ డిగ్రీ వాతావరణం వద్ద యూనిట్‌ సభ్యులు చేసిన పాటలు మరియు సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

సినిమా ప్రతి సన్నివేశం కోసం యూనిట్‌ సభ్యులంతా కూడా చాలా కష్టపడ్డారంటూ ఈ వీడియోను చూస్తూ ఉంటే అర్థం అవుతుంది. సినిమా కోసం అంతగా కష్టపడ్డారు కనుకే ఈ విజయం సాధ్యం అయ్యింది అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సీతారామం సినిమా యొక్క వసూళ్లు సినిమా నిర్మాతకు మాత్రమే కాకుండా బయ్యర్లకు కూడా సంతోషాన్ని మిగిల్చింది. ఈ ఏడాది మేటి సినిమాల్లో సీతారామం సినిమా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.



Full View

Tags:    

Similar News