మాస్ మహారాజా రవితేజ నటించిన 'క్రాక్' మూవీతో నాలుగేళ్ల విరామం తరువాత మళ్లీ తెలుగులో శృతిహాసన్ రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో తెలుగులో బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ఆఫర్లని సొంతం చేసుకుంది. ప్రస్తతం తెలుగులో మూడు భారీ సినిమాల్లో నటిస్తుంది. అందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న హైవోల్టేజ్ యాక్షన్ డ్రామా 'సలార్' ఒకటి.
'కేజీఎఫ్' ఫ్రాంఛైజీలతో బ్యాక్ రికార్డు స్థాయి బ్లాక్ బస్టర్స్ ని సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కతున్న ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆద్యగా ప్రభాస్ తో కలిసి అలరించబోతోంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింట్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ప్రభాస్ పెదనాన్న, సీనియర్ నటులు రెబల్ స్టార్ కృష్ణంరాజు అకాల మరణం కారణంగా ఈ మూవీ షూటింగ్ కి బ్రేక్ పడింది.
తాజాగా ప్రభాస్ సెట్లోకి ఎంటర్ కావడంతో ఈ మూవీ షూటింగ్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభించారు. కీలక ఘట్టాల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాలోని కీలక పాత్రలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తుండగా, జగపతిబాబు రాజమనార్ పాత్రలో కనిపించనున్నాడు. ఇతర కీలక పాత్రల్లో మధు స్వామి, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి నటిస్తున్నారు. ఇదిలా వుంటే శృతిహాసన్ ఈ మూవీ గురించి తొలిసారి స్పందించింది.
ప్రశాంత్ నీల్ విజన్ పై స్పష్టత వున్న దర్శకుడు. అలాంటి దర్శకుడితో కలిసి పని చేయడం చాలా ఆనదంగా వుందంటూ శృతిహాసన్ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. తను కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు అదే అతని బలం. ఆ ప్రపంచంలో నటీనటులుగా కలిసి ప్రయాణించడమే మా పని.
ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ప్రతీ సినిమాలో యాక్షన్ డ్రామా వుంటూనే ఎమోషన్స్ ని కట్టిపడేసే కోర్ వుంటుంది. 'సలార్'కూడా ప్రశాంత్ నీల్ గత చిత్రాల తరహాలో సాగే భారీ యాక్షన్ మూవీ అయితే ఇందులోనూ హ్యుమన్ డ్రామా వుంటుంది' అంటూ అసలు విషయం బయటపెట్టింది.
ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని 2023 సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీతో పాటు శృతి హాసన్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవితో 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ నటిస్తున్న 107వ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు ప్రాజెక్ట్ లు ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్నాయి. చిరుతో నటిస్తున్న 'వాల్తేరు వీరయ్య' సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రకాబోతోంది. బాలయ్య తో చేస్తున్న 107 ప్రాజెక్ట్ డిసెంబర్ లో రిలీజ్ అయ్యే అవకాశం వుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.