అప్పట్లో ఒకడుండేవాడు.. ఇప్పుడు టాలీవుడ్లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. దీని టీజర్.. ట్రైలర్ ఎంతో ఆసక్తి రేకెత్తించినప్పటికీ విడుదలకు ముందు ఈ సినిమాపై మరీ హైప్ ఏమీ లేదు. కానీ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడూ ఈ సినిమా గురించి గొప్పగా చెప్పడం.. మౌత్ టాక్ చాలా బాగుండటం.. సోషల్ మీడియాలో దీని గురించి పెద్ద చర్చ నడుస్తుండటంతో ఇప్పుడు ఈ సినిమాపై సినీ ప్రియుల దృష్టి కేంద్రీకృతమైంది. సినిమాలో భాగమైన అందరి గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
‘అప్పట్లో ఒకడుండేవాడు’లో ప్రధాన పాత్రధారుల్లో నారా రోహిత్ గురించి అందరికీ తెలిసిందే. శ్రీ విష్ణు కూడా కొత్త వాడేమీ కాదు. ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక దర్శకుడు సాగర్.కె.చంద్ర తొలి సినిమా ‘అయ్యారే’ కమర్షియల్ సక్సెస్ కాకపోయినా అతడి ప్రతిభ ఏంటో చాటి చెప్పింది. సంగీత దర్శకుడు సాయికార్తీక్ కూడా అందరికీ పరిచయమే. ఇక నిర్మాతల్లో ఒకరైన కృష్ణ విజయ్ అసుర సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. ఐతే పోస్టర్ మీద కనిపించే పేర్లలో జనాలకు పరిచయం లేనిది ప్రశాంతినే.
ఈ ప్రశాంతి మరెవరో కాదు.. శ్రీవిష్ణు భార్య. నారా రోహిత్ కు శ్రీవిష్ణు ఎంత మంచి స్నేహితుడో ప్రశాంతి కూడా అంతే క్లోజ్. కెరీర్ ఆరంభించే ముందు డ్యాన్స్ ఇన్ స్టిట్యూట్లో రోహిత్ కు పరిచయమైన శ్రీవిష్ణు తర్వాత అతడికి బాగా క్లోజ్ అయ్యాడు. ప్రశాంతి కూడా మంచి స్నేహితురాలైంది. వీళ్లంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యారు. తన భర్త ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తూ ప్రశాంతి చాలానే కష్టపడింది. ఈ చిత్రానికి ప్రశాంతి నిర్మాత కాకపోతే ఇంతమంచి ఫలితం వచ్చేది కాదని రోహిత్ స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఆమెది ఎంత కీలక పాత్రో అర్థం చేసుకోవచ్చు.
నారా రోహిత్ సినిమా ‘జ్యో అచ్యుతానంద’ సక్సెస్ ఊపులో అప్పట్లో ఒకడుండేవాడు’ను రిలీజ్ చేసేద్దామని కొందరు సలహా ఇచ్చినా ఆమె ఒప్పుకోలేదట. ఎడిటింగ్ విషయంలో మరింత శ్రద్ధ పెట్టి.. మరింత ఆకర్షణీయంగా సినిమా తయారవడంలో ఆమె కీలకంగా వ్యవహరించిందట. కాబట్టి ఈ సక్సెస్ లో ప్రశాంతి క్రెడిట్ ప్రశాంతికి ఇవ్వాల్సిందే.