ఏదైనా సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ అన్న టాక్ వినిపిస్తే చాలు .. మరునాడే మా సినిమా ఇంత వసూలు చేసింది.. అంత వసూలైపోయింది! అంటూ ఫిగర్స్(సంఖ్యల) తో పోస్టర్లు వేసి నానా హడావుడి చేసేస్తుంటారు. మూడు రోజుల్లో 100 కోట్ల పోస్టర్లు కూడా ఇంతకుముందు చూశాం.
కానీ అలాంటి హడావుడి ఏదీ లేకుండా సైలెంట్ గా ఈ విజయానికి థాంక్స్ అంటూ చెప్పారు వైల్డ్ డాగ్ నిర్మాత నిరంజన్ రెడ్డి. అది నిజంగానే మీడియాకి ఆశ్చర్యం కలిగించింది. సినిమా హిట్టు అన్న టాక్ వచ్చినా ఆయన స్పందన చాలా నిజాయితీగా ఉంది. నిజానికి ఇంత వసూలు చేయాలి అని లక్ష్యంతో సినిమా తీయలేదని నిజాయితీగా ఒక మంచి కథతో కొత్త ప్రయత్నం చేస్తే జనాలు మెచ్చుకుంటారనే ఈ సినిమా తీశామని అన్నారు. ఆశించిన రిజల్ట్ వచ్చింది. చాలా సంతోషంగా ఉందని కూడా ఆయన అన్నారు.
నాగార్జున యాక్షన్ థ్రిల్లర్ వైల్డ్ డాగ్ సక్సెస్ మీట్ సినిమా విడుదలైన ఒక రోజు తర్వాత జరిగింది. కానీ మేకర్స్ దీనిని వైల్డ్ డాగ్ మిషన్ అకాంప్లిష్డ్ మీట్ అని పిలవడం ఆసక్తికరం. వసూళ్ల లెక్కలు చెప్పేందుకు మేం సక్సెస్ వేడుకను నిర్వహించలేదని నిర్మాత చెప్పారు. ``ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించే మంచి సినిమా చేయాలనుకుంటున్నాం. మేము వసూళ్లపై ఎటువంటి తప్పుడు వాదనలు చేయలేం. వైల్డ్ డాగ్ లెక్కల మాటేమో కానీ.. సినిమా చూసిన వారు మా ప్రయత్నాలను ప్రశంసించారు. కాబట్టి మా లక్ష్యం నెరవేరింది`` అని నిజాయితీగా అనడం కనిపించింది. నాగార్జున లాంటి పెద్ద స్టార్ నటించినప్పుడు ఆమాత్రం ధీమా నిర్మాతకు ఉండాలి. ఉంటుంది కూడా. నిర్మాతలానే నాగార్జున కూడా వసూళ్ల గురించి పెద్దగా పట్టించుకోరు. దానిని నమ్మరు కూడా. ఎగ్జాగరేషన్ చేసేందుకు అస్సలు ఒప్పుకోరు. అందుకే నిర్మాత నిరంజన్ రెడ్డి కూడా నిజాయితీగానే ఉన్నారు! అంటూ చర్చ సాగుతోంది. సెకండ్ వేవ్ టెన్షన్స్ పెరుగుతున్నా.. ధైర్యం చేసి రిలీజ్ చేసినందుకు వైల్డ్ డాగ్ కి మంచి టాక్ వచ్చింది. అందుకు తగ్గట్టే మంచి వసూళ్లు దక్కితే ఇలాంటి మరిన్ని ప్రయత్నాలకు ఆస్కారం ఉంటుంది.