అన్నయ్య 'ఫోన్ కాల్'తో ఆలోచనలో పడ్డ మెగాహీరో!

Update: 2021-02-05 14:14 GMT
మెగాఫ్యామిలీ గురించి ఎలాంటి వార్త తెలిసినా ఫుల్ సందడి చేస్తుంటారు మెగాఫ్యాన్స్. అలాంటిది కొత్త సినిమా విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా.. మెగాప్రిన్స్ మెగాపవర్ స్టార్ లతో కలిసి ఓ సినిమా కథ విషయంలో మెగాస్టార్ కూడా చర్చల్లో నిలవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇలా మెగాహీరోలు ఒకే కథను ఒకరికి రెఫెర్ చేయడం గమ్మత్తుగా ఉందట. తమ్ముడు వరుణ్ తేజ్ కు రాంచరణ్ ఓ కథను సిఫారసు చేసాడట. ఈ కథను ఇప్పట్లో నేను చేయడం కుదరదు గాని నువ్ చేసేయ్ అని ఫోన్ చేసి చెప్పాడట. ప్రస్తుతం ఆలోచనలో పడ్డాడు ఈ మెగాప్రిన్స్. అసలు విషయం ఏంటంటే.. టాలీవుడ్ నిర్మాత ఒకరు కథను రెడీ చేసి మెగాస్టార్ చిరు, మెగాపవర్ స్టార్ రాంచరణ్ లకు వినిపించడం జరిగిందట. వారిద్దరికీ కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

అయితే ఆ కథతో రాంచరణ్ సినిమా చేయడం ఇప్పట్లో కుదిరేలా లేదట. ఎందుకంటే రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఇంకా చాలా టైం తీసుకునేలా ఉందట. అందుకే రాంచరణ్ తనకోసం తెచ్చిన కథను తమ్ముడు వరుణ్ కు బాగా సెట్ అవుతుందని ఆలోచించి ఫోన్ చేసి మరీ చెప్పాడట. ప్రస్తుతం ఈ ఫోన్ కాల్ సంభాషణ విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఎలాగైనా ఈ సినిమా నువ్ చేయాల్సిందే అన్నట్లుగా వరుణ్ తో చెప్పినట్లు తెలుస్తుంది. అయితే అన్నయ్య చెప్పడంతో ఆలోచనలో పడ్డాడు వరుణ్. అంతేగాక ఆ కథను మెగాస్టార్ కూడా మెచ్చాడని తెలిసి సానుకూలంగా స్పందించేందుకు ఆలోచిస్తున్నాడట. ఇదిలా ఉండగా.. ఇప్పటికే వరుణ్ గని, ఎఫ్3 సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే విడుదల కాబోతున్నాయి. చూడాలి మరి వరుణ్ ఎలా స్పందిస్తాడో!


Tags:    

Similar News