అలాంటి ఇలాంటి అశ్లీల సినిమాలను తీస్తున్నట్లుగా ఆరోపణల్ని ఎదుర్కొంటూ పోలీసు విచారణ అనంతరం అరెస్టు అయిన బాలీవుడ్ సీనియర్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా వ్యవహరం ఇప్పుడు షాకింగ్ గా మారిన సంగతి తెలిసిందే. భర్తను పోలీసులు అదుపులోకి తీసుకెళ్లటం.. అనంతరం అరెస్టు చోటు చేసుకోవటం.. కోర్టు ఆయన్ను పోలీసుల విచారణకు అనుమతించటం లాంటి వరుస పరిణామాల వేళలోనూ నోరు మెదపని శిల్పా శెట్టిని తాజాగా ముంబయి క్రైం బ్రాంచ్ పోలీసులు విచారణ జరిపారు. భర్త చేసే బూతు సినిమాల వ్యాపారం గురించి.. దానికి సంబంధించిన వివరాలతో పాటు.. శిల్ప హస్తం ఏమైనా ఉందా? అన్న ప్రశ్నకు సమాధానాలు వెతికేందుకు వీలుగా ఈ విచారణ సాగినట్లుగా తెలుస్తోంది.
ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద విడుదల చేసే ఈ బూతు సినిమాలకు సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదని శిల్ప తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. ముంబయి పోలీసుల ఆరు గంటల విచారణలో ఆమె పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. భర్తకు అండగా నిలిచినట్లుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అతడి మీద వస్తున్న ఆరోపణల్ని ఖండించటంతో పాటు.. తన భర్త అమాయకుడని వెనకేసుకు వచ్చినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. తన భర్త తీస్తున్న బూతు సినిమాలకు సరికొత్త భాష్యాన్ని చెప్పినట్లుగా తెలుస్తోంది. తన భర్త పోర్న్ మూవీస్ తీయడని.. శృంగారభరితమైన సినిమాలే తీస్తాడని పోలీసుల ఎదుట చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఈ రెండు రకాలైన సినిమాలకు మధ్య చాలా తేడా ఉందన్న విషయాన్నిశిల్ప తన వాంగ్మూలంలో వెల్లడించింది. సాయంత్రం మొదలైన పోలీసుల విచారణ గంటల పాటు సాగిందని.. రాత్రి పొద్దుపోయే వరకు పోలీసులు అడిగిన ప్రశ్నలకు శిల్ప ఓపికగా సమాధానం చెప్పినట్లుగా చెబుతున్నారు. బూతు సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పే హాట్ షాట్స్ ఓటీటీ ఫ్లాట్ ఫాంలో వచ్చేవన్నీ కూడా తన భర్త బావగారైన ప్రదీప్ భక్షి తీస్తారని ఆమె విచారణలో వెల్లడించారు. తన భర్త నిర్వహిస్తారని చెబుతున్న హాట్ షాట్స్ ఓటీటీ ప్లాట్ ఫాం మీద తనకు సరైన అవగాహన లేదని.. తన ప్రమేయం అందులో ఏమీ ఉండదని తేల్చినట్లుగా చెబుతున్నారు.
పోర్నోగ్రఫీకి.. ఏరోటికాకు మధ్యనున్న తేడాను గుర్తించాల్సిందిగా ఆమె కోరినట్లు తెలుస్తోంది. తన భర్త కేవలం ఏరోటిక్ మూవీస్ మాత్రమే చేసేవారని.. లండన్ లో ఉంటున్న రాజ్ కుంద్రా బావగారు ప్రదీప్ బక్షి పోర్న్ మూవీస్ తీస్తారని చెప్పినట్లుగా తెలుస్తోంది. తన భర్తకు హాట్ షాట్ యాప్ కు ఎలాంటి సంబంధం లేదని.. ఆ యాప్ ద్వారా ఆయన ఎలాంటి లాభాలు పొందలేదన్న మాటను పోలీసులకు స్పష్టం చేశారు.
తన భర్తను తప్పు పడుతున్న పోలీసులకు పంచ్ ఇచ్చేలా ఆమె కొన్ని కామెంట్స్ చేశారంటున్నారు. ఇతర ఓటీటీ వేదికల్లో వచ్చేకంటెంట్ అసభ్యకరంగా.. అశ్లీలంగా ఉంటుందని.. మరి వాటి గురించి ఎవరూ ఎందుకు పట్టించుకోరని ప్రశ్నించినట్లుగా చెబుతున్నారు. ఈ సందర్భంలో ముంబయి పోలీసులపై కొద్దిపాటి అసహనాన్ని శిల్పా వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఆమె వెల్లడించిన వివరాలన్నింటిని ముంబయి క్రైం బ్రాంచ్ పోలీసులు రికార్డు చేశారు.
కుంద్రాకు ఉన్న ఎస్ బ్యాంక్.. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఆఫ్రియాలో ఉన్న అకౌంట్లలోని రూ.7.5 కోట్ల మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ బూతు సినిమాల కంటెంట్ గురించి.. ఇతర వ్యాపార లావాదేవీల గురించి చర్చించుకోవటానికి వీలుగా కుంద్రా వాట్సాప్ గ్రూపును కూడా ఏర్పాటు చేసి తరచూ అందులో మాట్లాడుకునే వారన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. శిల్పాశెట్టి భర్త మీద బుక్ అయిన బూతు సినిమాల కేసు అంత త్వరగా తేలిపోయేట్లుగా కనిపించట్లేదనే మాట వినిపిస్తోంది.