కన్నడ హీరోయిన్ శనయా కాట్వే సోదరుడు రాకేష్.. దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 9న అతన్ని చంపేసి, దేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన దుండగులు.. అనంతరం ఆ ముక్కలను హుబ్లీ పరిసర ప్రాంతాల్లో వేర్వేరు చోట్ల పడేశారు. రాకేష్ కనిపించట్లేదన్న ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టారు.
ఈ కేసులో నియాజ్ అహ్మద్ ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు పోలీసులు. ఇతనితోపాటు తౌసిఫ్, అల్తాఫ్ ముల్లా, అమర్ అనే నలుగురిపైనా కేసు నమోదు చేశారు. అయితే.. ఈ హత్య కేసులో మృతుడు రాకేష్ సోదరి, హీరోయిన్ శనయా కాట్వే హస్తం కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానించి, ఆమెను కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.
ప్రధాన నిందితుడు నియాజ్ అహ్మద్-శనయా ప్రేమలో ఉన్నారని, వీరి ప్రేమను రాకేష్ అంగీకరించలేదని వార్తలు వచ్చాయి. ఈ వివాదం ముదరడంతోనే.. రాకేష్ ను హతమార్చినట్టు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే.. గుర్తు పట్టకుండా ఉన్న ఆ మృతదేహం రాకేష్ దా? కాదా? అని తేల్చడానికి పోలీసులు డీఎన్ఏ టెస్టును ఆశ్రయించారు.
ఈ నివేదిక అతి త్వరలో రానుంది. ఈ రిపోర్టు వచ్చిన తర్వాత కేసు విచారణ వేగం పుంజుకుంటుందని, దోషులు ఎవరు అనేది డీఎన్ఏ నివేదిక వచ్చాక తేలిపోతుందని హుబ్లీ పోలీసులు భావిస్తున్నారు. దీంతో.. ఆ రిపోర్టులో ఏం ఉంటుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.