బాహుబలి విజయంతో ప్రభాస్ మానియా అమాంతం పెరిగిపోయింది. వరల్డ్ వైడ్ గా అసాధారణ గుర్తింపు దక్కించుకున్నాడు. స్వదేశంలో అయితే పెద్ద స్టార్ అయిపోయాడు. ఇక టాలీవుడ్ లో అయితే ఆయన క్రేజ్ గురించి వర్ణించడం అసాధ్యం. అటు బాలీవుడ్ దర్శక - నిర్మాతలు ఈ డార్లింగ్ కోసం కాచుకుని కూర్చుకున్నారు. ఇంతటి ఆదరణ చూసి ప్రభాస్ నివ్వెరపోయాడు. ఇంతటి క్రేజ్ ను చూసి పలు వ్యాపార సంస్థలు బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరించమని వెంటపడుతున్నాయి. ఇక కాస్త కొత్తగా కనబడాదామని ప్రభాస్ తన ఫేస్ బుక్ కవర్ ఫోటోను కూడా మార్చేశాడు.
బాహుబలిలో శివుడు గెటప్ లో ఉన్న ఫోటోన్ అప్ డేట్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా తెగ సంబర పడిపోయారు. రెండు గంటల్లో ఆ కవర్ ఫోటోకి 1,51,593 లైక్ లు వచ్చాయి. 1184 షేర్లు చేశారు. జనాల్లో ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందనేదానికి ఇది పెద్ద నిదర్శనం. ఇక బాహుబలి-2 విజయం సాధిస్తే డార్లింగ్ కు ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుంది? బాహుబలి ది బిగినింగ్ లో ఎండిగ్ యాక్షన్ సీన్స్ కే ఇంత రెస్పాన్స్ వచ్చిందటే అసలైన పోరాటాలు బాహుబలి ది కనుక్లూజన్ లో ఉండబోతున్నాయి. రానా తో తలపడే ప్రతి సన్నివేశం పీక్స్ లో ఉంటుందనే ఇప్పటికే ప్రచారం సాగుతోంది. మరి అప్పుడు ఈ బాహుబలుడి క్రేజ్ ఎలా ఉంటుందో ఓ సారి ఊహించుకోండి!