అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కిన సినిమా 'లవ్ స్టోరీ'. క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ సినిమాను మూడేళ్లు గ్యాప్ తీసుకొని జాగ్రత్తగా తెరకెక్కించాడు. ఈ సినిమా ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. సినిమా పై అభిమానులలో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికే లవ్ స్టోరీ పాటలు, టీజర్ సోషల్ మీడియాలో ఫుల్ బజ్ క్రియేట్ చేసాయి. అలాగే సాంగ్స్ అయితే ముఖ్యంగా సారంగదరియా సాంగ్ ఓ సంచలనంగా మారింది. మొత్తానికి సినిమా అన్నివిధాలా విడుదలకు సన్నద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' మూవీ ఏప్రిల్ 9న విడుదల కాబోతుంది. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత పవన్ కళ్యాణ్ థియేటర్లో కనిపించడంతో మెగాఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్ హల్చల్ మాములుగా లేదు.
ఇప్పటికే విడుదలైన వకీల్ సాబ్ ట్రైలర్ సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. అలాగే మిలియన్స్ లో ట్రైలర్ పరుగులు పెడుతోంది. అయితే వకీల్ సాబ్ రిలీజ్ అవుతుండటంతో లవ్ స్టోరీ మూవీ రిలీజ్ వాయిదా పడనుందని పుకార్లు వచ్చాయి. కానీ పుకార్ల పై స్పందించిన లవ్ స్టోరీ నిర్మాతలు అలాంటిది ఏం లేదని అనుకున్న డేట్ కే సినిమా విడుదల అవుతుందని క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా బ్లాక్ బస్టర్ అయితే గనక నిర్మాత దిల్ రాజు అన్ని థియేటర్లలో సినిమాను మరోవారం కంటిన్యూ చేసే అవకాశం ఉంది. అలాంటి సమయంలో లవ్ స్టోరీ సినిమాకు థియేటర్స్ దొరకడం కష్టమవుతుందని అంతా అనుకున్నారు. కానీ లవ్ స్టోరీ నిర్మాతలు తమ సినిమాకు అలాంటి ప్రాబ్లెమ్ లేదని సినిమా పక్కా అదే డేట్ కు విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. చూడాలి మరి ఏం జరగనుందో!