నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీనుల కాంబోలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ షూటింగ్ కరోనా కారణంగా గత ఏడాది మార్చి నెలలో ఆగిపోయిన విషయం తెల్సిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పునః ప్రారంభించారు. ఇక ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయినప్పటి నుండి కూడా సినిమాలో ఎమ్మెల్యేగా ఒక యంగ్ హీరో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ యంగ్ హీరో ఎవరు అనే విషయమై చాలా వార్తలు వచ్చాయి. ఎమ్మెల్యే పాత్రకు ఎవరు సెట్ అయ్యారు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సమయంలోనే ఈ సినిమాలో మరో యంగ్ హీరో కూడా నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
యంగ్ హీరో నాగశౌర్య ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా కొత్తగా వార్తలు వస్తున్నాయి. సినిమాలో ఒక యంగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర ఉంటుంది. కనిపించేది కొద్ది సమయమే అయినా కూడా ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ మరియు కథకు చాలా ముఖ్యమైనది. కనుక ఆ పాత్రకు గాను హీరో నాగశౌర్యను దర్శకుడు బోయపాటి సంప్రదించాడని తెలుస్తోంది. ప్రస్తుతం నాగశౌర్య చాలా సినిమాలే చేస్తున్నాడు. అయినా కూడా బాలయ్యతో మూవీ అవ్వడంతో పాటు కీలక పాత్ర అవ్వడం వల్ల సినిమాను చేసేందుకు కమిట్ అయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై బోయపాటి లేదా నాగశౌర్య క్లారిటీ ఇస్తారేమో చూడాలి.