అల ఏడాది దాటిన్నా రికార్డుల పరంపర కంటిన్యూ

Update: 2020-11-27 11:50 GMT
అల వైకుంఠపురంలో సినిమా ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చంది. అయితే పాటలు సినిమా కంటే మూడు నెలల ముందుగానే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సామజవరగమన పాట సినిమాపై అంచనాలు అమాంతం పెంచింది అనడంలో సందేహం లేదు. ఆ పాటతో పాటు సినిమా విడుదలకు ముందు వచ్చిన అన్ని పాటలు కూడా సూపర్‌ హిట్‌ అయ్యి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. పాటలు విడుదల అయ్యి ఏడాదికి పైగానే అయ్యింది. అయినా ఇంకా కూడా అల వైకుంఠపురంలో సినిమాలోని పాటలు యూట్యూబ్ లో ట్రెండ్‌ అవుతూనే ఉన్నాయి.

యూట్యూట్‌ టాప్‌ పాటల జాబితాలో బుట్ట బొమ్మ ప్లేస్‌ సంపాదించింది. 450 మిలియన్‌ ల వ్యూస్‌ ను దక్కించుకున్న ఆ పాట 3 మిలియన్‌ ల లైక్స్‌ ను దక్కించుకుంది. ఇక తాజాగా సామజవరగమన పాట కూడా వ్యూస్‌ మరియు లైక్స్‌ విషయంలో కుమ్మేస్తోంది. ఈ పాట లిరికల్‌ మరియు వీడియో సాంగ్‌ గా రెండు వర్షన్‌ లలో విడుదల అయ్యింది. వీడియో సాంగ్‌ కు 143 మిలియన్‌ ల వ్యూస్‌ వచ్చాయి. తాజాగా వీడియో సాంగ్‌ కు మిలియన్‌ లైక్స్‌ వచ్చాయి. బుట్ట బొమ్మకు 3 మిలియన్‌ ల లైక్స్‌ రాగా ఈ పాటకు మిలియన్‌ లైక్స్‌ రావడంతో అల వైకుంఠపురంలో పాటలు ఏ స్థాయిలో రచ్చ చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

థమన్‌ సంగీత సారథ్యంలో వచ్చిన అల వైకుంఠపురంలోని పాటలు మరో ఏడాది పాటు ఇదే జోరును కొనసాగిస్తాయని బన్నీ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆల్‌ టైమ్‌ హిట్‌ గా నిలిచిన ఈ సినిమా పాటల విషయంలో కూడా అంతకు మించిన రికార్డును సొంతం చేసుకుంటున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌.. బన్నీల కాంబోలో వచ్చిన ఈ మూడవ సినిమా సంక్రాంతి విజేతగా నిలవడంతో పాటు ఈ ఏడాది విజేతగా కూడా నిలిచింది అనడంలో సందేహం లేదు.


Tags:    

Similar News