ఆనంద్ దేవరకొండ హీరోగా విజయ్ దేవరకొండ తన సొంత నిర్మాణ సంస్థపై 'పుష్పక విమానం' సినిమాను నిర్మించాడు. ఈ సినిమాతో దర్శకుడిగా దామోదర పరిచయమవుతున్నాడు. ఆనంద్ దేవరకొండ సరసన నాయికలుగా శాన్వి మేఘన - గీత్ శైని నటించారు. సునీల్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, ఈ నెల 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న రాత్రి వైజాగ్ లో నిర్వహించారు.
ఈ వేదికపై దర్శకుడు దామోదర మాట్లాడుతూ .. "నాది కూడా వైజాగ్ నే .. హాయిగా బీచ్ రోడ్ లో తిరుగుతూ కథలు రాసుకుంటూ ఉండేవాడిని. అలాంటి నా ఫస్టు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో జరగడం నన్ను కొంచెం ఎమోషనల్ అయ్యేలా చేస్తోంది. విజయ్ ను చూడటానికి శ్రీకాకుళం .. వైజాగ్ .. విజయనగరం నుంచి ఫ్యాన్స్ వచ్చారు. ఆయన సెల్ఫీ ఇస్తానంటే విమానాల్లో వచ్చేవాళ్లున్నారు. అలా ఉంది విజయ్ క్రేజ్.
విజయ్ ప్రొడ్యూసర్ అయితే 'పుష్పక విమానం' రేంజ్ కూడా అంతే ఉంది. నిజం చెప్పాలంటే నేను చేసింది చాలా చిన్న సినిమా. కానీ విజయ్ ఓన్ చేసుకుని ప్రమోట్ చేస్తూ ఉండటంతో ఒక పెద్ద సినిమా అనే ఫీలింగ్ వచ్చేస్తోంది. ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావాలంటే చాలా కష్టపడాలి. విజయ్ నిర్మాత కావడం వలన ఆ పని అంతా కూడా చాలా తేలికగా జరిగిపోయింది. ఇక విజయ్ దేవరకొండ మాదిరిగానే ఆనంద్ కి కూడా ఫాలోయింగ్ మొదలైపోయిందనే విషయం నాకు అర్థమైపోయింది.
ఈ సినిమాకి చాలా మంచి టెక్నీషియన్స్ పనిచేశారు. అలాగే సునీల్ .. నరేశ్ వంటి సీనియర్ ఆర్టిస్టులు నటించారు. ఆనంద్ .. గీత్ శైని .. శాన్వి మేఘన వీళ్లంతా కూడా వాళ్ల పాత్రలను ఓన్ చేసుకున్నారు. అలా చేయనా? .. ఇలా చేయనా? అంటూ కొత్త దర్శకుడినైన నన్ను కన్ఫ్యూజ్ చేసేవాళ్లు. తప్పనిసరి పరిస్థితుల్లో నేను అక్కడి నుంచి తప్పుకునేవాడిని కూడా. ఈ సినిమాకి మార్క్ కె రాబిన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ఒక రేంజ్ లో ఉంటుంది. ఈ సినిమా ఈ నెల 12వ తేదీన వస్తుంది. ఇది ఆనంద్ వన్ మేన్ షో .. మంచి కామెడీ ఉంటుంది .. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు" అని చెప్పుకొచ్చాడు.