తండ్రి సినిమాలో నటించే అవకాశం అలా మిస్సయిన కొడుకు

Update: 2022-08-04 02:30 GMT
బాలీవుడ్ తో పాటు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆమీర్‌ ఖాన్‌ హీరోగా నటించిన లాల్‌ సింగ్ చడ్డా సినిమా గురించి చర్చ జరుగుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక హిందీ సినిమా ను దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున పలు భాషల్లో డబ్‌ చేసి విడుదల చేస్తున్నారు. గతంలో కొన్ని సినిమాలు సౌత్‌ భాషల్లో కూడా విడుదల చేసినా కూడా ఈ స్థాయి రిలీజ్ మాత్రం ఏ సినిమాకు దక్కలేదు.

వచ్చే వారం విడుదల కాబోతున్న లాల్‌ సింగ్ చడ్డా సినిమాలో ఆమీర్ ఖాన్‌ చాలా విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఒకే పాత్ర అయినా కూడా వేరియేషన్స్ చాలానే ఉండటంతో ఇది కేవలం ఆమీర్ ఖాన్‌ కు మాత్రమే సాధ్యం అయ్యే పాత్ర అనే అభిప్రాయంను యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ సమయంలో యూనిట్‌ సభ్యుల ఆలోచన వేరుగా ఉంది.

ఆమీర్ ఖాన్‌ పోషించిన పాత్ర కు సంబంధించిన టీనేజ్ పాత్రను మొదట గా ఆమీర్ ఖాన్‌ తో కాకుండా కొత్త నటుడితో చేయించాలని అనుకున్నారు. అందుకోసం పదుల సంఖ్యలో కొత్త కుర్రాళ్ల నుండి ఆడిషన్స్ తీసుకున్నారట. ఆ ఆడిషన్స్ ఇచ్చిన వారిలో ఆమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ కూడా ఉన్నాడట.

ఆడిషన్స్ జరిగిన కొన్నాళ్లకు ఆ పాత్రను మరో వ్యక్తితో చేయించడం వల్ల ఫీల్‌ రాదేమో అనే ఉద్దేశ్యంతో ఆమీర్ ఖాన్‌ నే చిన్న వయసు కుర్రాడిగా చేయాలని.. చిన్న పాటి గ్రాఫిక్స్ ను యూజ్‌ చేసి మ్యానేజ్ చేశారట. అలా తండ్రి ఆమీర్‌ సినిమాలో నటించే అవకాశం ను కొడుకు జునైద్ మిస్ చేసుకున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆమీర్ ఖాన్ మాట్లాడుతూ ఆడిషన్స్ కు సంబంధించిన వీడియోలు చూసిన సమయంలో జునైద్‌ వీడియోను చూశాను.

చాలా అద్భుతంగా నటించాడు. జునైద్‌ లో ఇంత మంచి నటుడు ఉన్నాడా అని నాకే ఆశ్చర్యం అనిపించింది. ఇక జునైద్ విషయానికి వస్తే త్వరలోనే హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన యశ్ రాజ్‌ ఫిల్మ్స్ వారు ఇప్పటికే జునైద్‌ తో సినిమాను చేసేందుకు ఒప్పందం చేసుకోవడం తో పాటు అందుకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించారట.
Tags:    

Similar News