చిన్న చిత్రాలు ప్లాన్‌ చేస్తున్న సూపర్‌ స్టార్‌

Update: 2020-08-06 05:30 GMT
బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ ఓటీటీ కోసం రెండు సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా బాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. వందల కోట్ల మార్కెట్‌ ఉన్న హృతిక్‌ రోషన్‌ ఓటీటీ కోసం చిన్న బడ్జెట్‌ చిత్రాలు చేసేందుకు ఒప్పుకోవడం ప్రస్తుతం బాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. గత ఏడాది సూపర్‌ 30 మరియు వార్‌ చిత్రాలతో వందల కోట్ల వసూళ్లు సాధించి తన స్టార్‌ డంను మరింతగా పెంచుకున్న ఈ హీరో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వందల కోట్ల బడ్జెట్‌ వర్కౌట్‌ అవ్వదనే ఉద్దేశ్యంతో పాతిక కోట్ల బడ్జెట్‌ లో సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడట.

హృతిక్‌ రోషన్‌ 300 కోట్ల బడ్జెట్‌ తో ‘క్రిష్‌ 4’ చిత్రానిన చేయాలనుకున్నాడు. కాని కరోనా కారణంగా రాబోయే రెండు సంవత్సరాల వరకు పరిస్థితులు భారీ సినిమాలకు అనుకూలించేలా లేదు. అందుకే క్రిష్‌ 4 సినిమాను 2022లో చేయాలని ఆయన భావిస్తున్నాడు. ప్రస్తుతానికి ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్‌ వర్క్‌ జరుగుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో ఒక కామెడీ ఎంటర్‌ టైనర్‌ ను ఒక యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ ను హృతిక్‌ ప్లాన్‌ చేస్తున్నాడట.

ఈ రెండు సినిమాలు కూడా ఓటీటీలోనే విడుదల చేయాలని ఆయన భావిస్తున్నాడట. ప్రముఖ ఓటీటీతో ఒప్పందం చేసుకున్న హృతిక్‌ రోషన్‌ ఈ ఏడాది చివరి నుండి ఆ సినిమాల షూటింగ్‌ లో పాల్గొనబోతున్నాడు. 2021 ప్రథమార్థంలోనే ఆ రెండు ఓటీటీ మూవీస్‌ ను కూడా పూర్తి చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా సమాచారం అందుతోంది. మొత్తానికి ఓటీటీ కోసం సూపర్‌ స్టార్‌ ఓకే చెప్పడంతో ఇతర హీరోలు కూడా ఆ దిశగా అడుగులు వేసే అవకాశం ఉందంటున్నారు.
Tags:    

Similar News