తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా గత కొంత కాలంగా ఏడాదికి మినిమం రెండు సినిమాల చొప్పున విడుదల అవుతూ వస్తున్నాయి. ఏడాదిలో రెండు సినిమాలు విడుదల చేస్తున్న సౌత్ స్టార్ హీరోగా విజయ్ కి గుర్తింపు దక్కింది. గత ఏడాది కూడా రెండు సినిమాలు విడుదల కావాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా దెబ్బ పడింది. గత ఏడాది విడుదల అవ్వాల్సిన మాస్టర్ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చింది. ఇంకా ఏడాది కాలం ఉంది కనుక ఈ ఏడాది ద్వితీయార్థంలో మరో సినిమా తో కూడా విజయ్ వచ్చే అవకాశం ఉందని ఆయన అభిమానులు అనుకుంటున్నారు. కాని పరిస్థితులు చూస్తుంటే విజయ్ తదుపరి సినిమా ఏడాది వచ్చేది అనుమానంగానే ఉంది.
విజయ్ తదుపరి సినిమా గత ఏడాదిలోనే ఫిక్స్ అయ్యింది. కోలమవు కోకిల సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ సినిమాను చేయబోతున్నాడు. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ 'డాక్టర్' సినిమాను విడుదల చేసే పనుల్లో ఉన్నాడు. ఇటీవలే డాక్టర్ మూవీ విడుదల తేదీ వచ్చింది. డాక్టర్ సినిమా కారణంగా విజయ్ మూవీ ఆలస్యం అవుతుంది. గతంలో విజయ్ సినిమా విడుదల కాకుండానే మరో సినిమా పట్టాలెక్కేది. కాని ఈసారి మాత్రం మాస్టర్ పూర్తి అయ్యి ఏడాది దాటినా ఇప్పటి వరకు కొత్త సినిమా పట్టాలు ఎక్కలేదు. మద్యలో కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. ఇప్పుడు డాక్టర్ సినిమా కారణంగా వాయిదా పడింది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే విజయ్ నెల్సన్ దిలీప్ కుమార్ ల మూవీ ఏప్రిల్ లో పట్టాలెక్కే అవకాశం ఉందంటున్నారు.