టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో రీమేక్ సినిమాలు మరియు డబ్బింగ్ చిత్రాల సందడి ఎక్కువ కనిపిస్తోంది. ఇతర భాషల్లో విజయవంతమైన సినిమాలను రైట్స్ తీసుకొని మన నేటివిటీకి తగ్గట్టుగా మార్చి రీమేక్ చేయడమో లేదా డబ్బింగ్ చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడమో చేస్తూ లాభాలు వెనకేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఎక్కువగా బడా నిర్మాతలే వీటి మీద దృష్టి సారిస్తుండటం గమనార్హం.
మంచి కంటెంట్ ఉంటే సినిమా చిన్నదా పెద్దదా? రీమేకా డబ్బింగా? అనే విషయాలను తెలుగు ఆడియన్స్ పెద్దగా పట్టించుకోరు. మూవీ బాగుందంటే చాలు ఎగబడి చూసేస్తుంటారు. ఈ విషయాన్ని గ్రహించిన పలువురు ప్రముఖ నిర్మాతలు.. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే ఇతర భాషల కంటెంట్ ను గుర్తించే పనిలో పడ్డారు. కొంచం టాక్ బాగున్నా.. తక్కువ మొత్తానికి డబ్బింగ్ రైట్స్ తీసుకొని తెలుగులోకి దించేస్తున్నారు.
ఇటీవల మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ లో 'కాంతారా' వంటి కన్నడ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసి లాభాలు గడించారు. తెలుగు చిత్రాలను వెనక్కి నెట్టి మరీ ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద డామినేషన్ చూపించింది. అలానే అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద 'సర్దార్' వంటి తమిళ సినిమాని ఒకేసారి తెలుగులోనూ విడుదల చేసి విజయం సాధించారు.
అంతకముందు రానా దగ్గుబాటి తన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో 'చార్లీ 777' అనే కన్నడ డబ్బింగ్ చిత్రాన్ని రిలీజ్ చేసి మంచి వసూళ్లు రాబట్టారు. ఇప్పటికే అల్లు అరవింద్ 'భేడియా' అనే హిందీ మూవీని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు టాలీవుడ్ లో డబ్బింగ్ చిత్రాల ట్రెండ్ పెద్దగా వర్కవుట్ అవుతుండటంతో.. ఇతర స్టార్ ప్రొడ్యూసర్స్ కూడా ఇతర భాషల్లో హిట్టైన సినిమాలను రీమేక్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఈ క్రమంలో టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు కూడా ఓ హిట్ చిత్రాన్ని డబ్బింగ్ చేయడానికి రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. 'వారసుడు' సినిమాతో కోలీవుడ్ లో అడుగుపెడుతున్న దిల్ రాజు.. ''లవ్ టుడే'' అనే తమిళ మూవీని తెలుగులో సమర్పించనున్నారట.
''లవ్ టుడే'' అనేది ఇటీవల కోలీవుడ్ లో విడుదలైన ఓ చిన్న సినిమా. 'కోమలి' ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కింది. ప్రదీప్ రంగనాథన్ తో పాటుగా ఇవానా - రవీనా రవి ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. సత్యరాజ్ - రాధికా శరత్ కుమార్ - యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. నేటి యువతరం భావాలకు అద్దంపట్టే అంశాలతో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు.
గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన 'లవ్ టుడే' చిత్రానికి ప్రేక్షకుల నుండి సానుకూల స్పందన లభించింది. మౌత్ టాక్ బాగుండటంతో రోజు రోజుకూ థియేటర్లు పెంచుతున్నారు. దీంతో మూడు రోజుల్లోనే 22 కోట్ల వరకూ రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ఈ చిత్రాన్ని.. ఇప్పుడు దిల్ రాజు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని టాక్.
'లవ్ టుడే' సినిమా హక్కులు తీసుకొని తెలుగులోకి డబ్బింగ్ చేయాలని చూస్తున్నారట. అంతేకాదు నవంబర్ 18న రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని కూడా అంటున్నారు. అయితే తమిళ్ నేటివిటీ ఉన్న మూవీ తెలుగు ఆడియన్స్ కు ఎక్కుతుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఇటీవల దిల్ రాజు భారీ ఎత్తున విడుదల చేసిన 'పొన్నియన్ సెల్వన్ 1' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.