'ఉప్పెన' సంగతి సరే.. మ‌రి 'కొండపొలం' మాటేంటి..?

Update: 2021-02-21 02:30 GMT
మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో తెరంగ్రేటం జరిగిపోయింది. చిరంజీవి చిన్న మేనల్లుడు, సాయి తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. వాలెంటైన్స్ వీక్ లో విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్ళు రాబడుతోంది. అయితే ఈ సినిమా సక్సెల్ లో సగం మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తీసుకెళ్లిపోతే.. మిగ‌తా స‌గం హీరోయిన్ కృతి శెట్టి - మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్ర‌సాద్ తీసుకెళ్లిపోయాడనే కామెంట్స్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. కారణాలేవైనా ఈ సినిమా రిలీజ్ కాకముందే నాలుగు ఆఫ‌ర్స్ వైష్ణ‌వ్ చేతిలో ఉన్నాయి. అందులో డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో చేస్తున్న సినిమా కూడా ఉంది.

ఒకవైపు వైష్ణవ్ నటించిన 'ఉప్పెన' విడుదలపై క్లారిటీ లేకపోవడం.. మరోవైపు పవన్ కళ్యాణ్ తో క్రిష్ చేస్తున్న సినిమా లేట్ అవుతూ ఉండటంతో వైష్ణవ్ - క్రిష్ కాంబోలో ఓ సినిమా స్టార్ట్ చేశారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. రాజీవ్ రెడ్డి - జాగర్లమూడి సాయిబాబా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో ప్రారంభమైన ఈ సినిమాని శరవేగంగా చిత్రీకరించి 45 రోజుల్లోనే పూర్తి చేశారు. ఈ చిత్రానికి 'కొండపొలం' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

అయితే 'ఉప్పెన' కి భారీ ఓపెనింగ్స్ వచ్చినట్లే.. క్రిష్ సినిమాకు ఓపెనింగ్స్ రావాలంటే వైష్ణ‌వ్ అంతకుమించి క‌ష్ట‌ప‌డాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ కు జ‌నాలు ఎట్రాక్ట్ అయ్యేది కేవలం వైష్ణ‌వ్ ని చూసి మాత్ర‌మే. 'ఎన్టీఆర్ కథానాయకుడు' 'ఎన్టీఆర్ మహనాయకుడు' సినిమాలు ప్లాప్ అవడంతో క్రిష్ సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి తగ్గింది. ఇక 'మన్మథుడు 2' సినిమా తర్వాత ర‌కుల్ ని టాలీవుడ్ లో పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో మెగా మేనల్లుడి రెండో సినిమా ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తుందో అని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News