తాను లాయరు ఐఏఎస్ ఏపీఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాల గురించి కలలు కన్నానని అయితే తాను అనుకున్నది సాధించుకునేందుకు ఆర్జన అవసరమై సినీరంగంలోకి వచ్చానని తెలిపారు పూనమ్ కౌర్. ఇది ఇతరులకు తెలియదని కూడా అన్నారు.
అందరు అమ్మాయిల్లానే తాను కూడా పెళ్లి చేసుకుని జీవితంలో సెటిలవ్వాలనుకున్నానని కానీ దానిపై కొందరు నెగెటివ్ కామెంట్లు చేశారని వాపోయారు.
తన పెళ్లి కలల్ని తుంచేశారని తనని కించపరిచారని ఆవేదనను వ్యక్తం చేసారు. పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రతిసారీ కొందరు వ్యక్తులు కించపరిచారని కూడా పూనమ్ అన్నారు.
అలా ఎందుకు చేస్తున్నారో అని కూడా నేను ఆలోచించలేదు. జీవితంలో పైకి ఎదగాలనే ప్రయత్నించానని పూనమ్ వెల్లడించారు. నా చుట్టూ ఎందరో రావణులు ఉన్నా నేను దేవతను. అందుకే క్షమించానని అన్నారు. అయితే అమ్మను తలుచుకున్నప్పుడల్లా ఎమోషన్ అవుతానని అన్నారు.
ఏ కూతురికైనా త్వరగా పెళ్లి అయితే తల్లి సంతోషిస్తుంది. ఈ విషయంలో అమ్మను తలచి ఎమోషన్ అవుతానని అన్నారు.
నేను ఒక సినిమా అవకాశం కోసం కొందరు పెద్దల దగ్గరకు వెళ్లానని వారు నాపై కోప్పడ్డారని వార్తలొచ్చాయి. కానీ అది నిజం కాదు. మరొకరిని టార్గెట్ చేసే క్రమంలో నన్ను ఆయుధంగా ఉపయోగించుకున్నారు అంతేనని పూనమ్ వెల్లడించారు. కొందరి కారణంగా పరిశ్రమలో చాలా అవకాశాలు వదులుకున్నానని అన్నారు.