కేంద్ర ప్రభుత్వం ఈనెల 15 నుండి అంటే రేపటి నుండి థియేటర్లకు అన్ లాక్ చేసేసిన విషయం తెల్సిందే. దేశ వ్యాప్తంగా రేపటి నుండి థియేటర్లలో బొమ్మ పడుతుందని అంతా భావిస్తుంటే చాలా చోట్ల ఇంకొన్నాళ్ల వరకు థియేటర్లకు లాక్ ఓపెన్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు లాక్ ను కొనసాగిస్తుంటే మరికొన్ని చోట్ల మాత్రం థియేటర్ల యాజమాన్యాలు సొంతంగానే లాక్ లో ఉండాలనుకుంటున్నారు. ఏపీలో థియేటర్ల ఓపెన్ విషయమై థియేటర్ల యాజమాన్యాలు ప్రస్తుతం మంత్రి పేర్ని నానితో చర్చలు జరుపుతున్నారు.
ఏడు నెలలుగా థియేటర్లు మూతబడి ఉన్న కారణంగా భారీ నష్టాల్లో ఉన్నాం. కనుక థియేటర్లపై ఉన్న కరెంటు బిల్లు బకాయిలు అన్ని కూడా రద్దు చేయాలని అలాగే నిర్వహణ ఖర్చు పెరిగే అవకాశం ఉంది కనుక టికెట్ల రేట్లు పెంచుకునేందుకు గాను అనుమతులు ఇవ్వాలంటూ ప్రభుత్వం ముందు కండీషన్స్ పెట్టడం జరింగింది. ప్రభుత్వం వాటికి ఒప్పుకుంటే తప్ప థియేటర్లను తెరిచే పరిస్థితి లేదంటూ థియేటర్ల యాజమాన్యాలు అంటున్నారు.
ఈ ఏడు నెలల కాలానికి కూడా మినిమం కరెంటు బిల్లు చొప్పున ఒక్కో థియేటర్ కు దాదాపుగా మూడు నుండి అయిదు లక్షల రూపాయల వరకు బిల్లు వేశారంటూ థియేటర్ల యాజమాన్యాలు చెబుతున్నాయి. వాటిని రద్దు చేయాలంటూ వారు కోరుతున్నారు. గతంలో జగన్ కరెంటు బిల్లులను రద్దు చేస్తామన్నారు. ఆ హామీని నిలుపుకోవాలంటూ యాజమాన్య సంఘం నాయకులు కోరారు. ఏపీలో రేపటి నుండి థియేటర్లు ఓపెన్ అనుమానమే. దసరా వరకు థియేటర్లను పాక్షికంగా అయినా ఓపెన్ చేసే అవకాశం ఉందంటున్నారు.