2023 సంక్రాంతికి ఏయే సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయనే విషయం మీద క్లారిటీ వచ్చేసింది. కాకపోతే రిలీజ్ డేట్స్ పై అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' మరియు నందమూరి బాలకృష్ణ 'వీరసింహా రెడ్డి' చిత్రాలు బాక్సాఫీస్ బరిలో దిగితున్నాయి. ఈ రెండు తెలుగు సినిమాలతో పాటుగా 'వారసుడు' - 'తునివు' వంటి డబ్బింగ్ చిత్రాలు వస్తున్నాయి.
అయితే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లోనే రూపొందిన రెండు సినిమాలు ఒకేసారి విడుదల అవుతుండటమే ఇప్పుడు చర్చనీయంగా మారింది. 75 ఏళ్ళ సినీ ఇండస్ట్రీ చరిత్రలో ఒకే బ్యానర్ నుంచి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ చేయడం అనేది ఇదే తొలిసారి. అందుకే ఏం జరుగుతుందో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. రెండు చిత్రాలకు థియేటర్లు ఎలా చేస్తారు.. ఇరు వర్గాల అభిమానులు సంతృప్తి పరిచేలా ఎలా ప్రమోషనల్ కార్యక్రమాలు చేస్తారో అని వేచి చూస్తున్నారు.
ఇప్పటి వరకూ మైత్రీ మూవీ మేకర్స్ సినిమాలను నైజాంలో అగ్ర నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మైత్రీ టీం నైజాంలో కొత్తగా ఆఫీస్ ఓపెన్ చేసి సొంతంగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికైతే ఇంకా ఖచ్చితమైన విడుదల తేదీలను ప్రకటించలేదు. ఇతర ప్రాంతాలకు సంబంధించిన ఒప్పందాలు ఇంకా ఖరారు కాలేదు. నిర్మాతలు థియేట్రికల్ డీల్స్ ఖరారు చేస్తారని డిస్ట్రిబ్యూటర్లు ఎదురుచూస్తున్నారు.
'పుష్ప: ది రైజ్' మరియు 'సర్కారు వారి పాట' సినిమాలకు సంబంధించి కొన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్స్ కు మైత్రీ వారు బకాయిలను తిరిగి చెల్లించాల్సి ఉందని టాక్ ఉంది. ఇప్పుడు 'వాల్తేరు వీరయ్య' - 'వీరసింహా రెడ్డి' డీల్స్ విషయంలో.. పెండింగ్ లో ఉన్న బకాయిల గురించి డిస్ట్రిబ్యూటర్స్ ప్రశ్నిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ మేకర్స్ ఇంకా డీల్స్ క్లోజ్ చేయలేదని అంటున్నారు.
'వీరసింహా రెడ్డి' మరియు 'వాల్తేరు వీరయ్య' సినిమాల షూటింగ్స్ చివరి దశకు చేరుకున్నాయి. ఒకటీ లేదా రెండు రోజుల గ్యాప్ లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. విడుదలకు కేవలం ఐదు వారాల సమయం మాత్రమే ఉన్నందున, మైత్రీ టీమ్ థియేట్రికల్ డీల్స్ ను వీలైనంత త్వరగా ముగించాల్సి ఉంటుంది. అలానే ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పటి వరకూ రెండు సినిమాల నుంచి టీజర్ మరియు ఒక్కో సాంగ్ ని రిలీజ్ చేసారు. రాబోయే రోజుల్లో జనాల దృష్టిని ఆకర్షించడానికి.. ఫ్యాన్స్ ని మెప్పించడానికి సరికొత్త ప్రమోషనల్ స్ట్రాటజీలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. థియేటర్స్ విషయంలో ఎవరికీ ఇబ్బంది లేదని దిల్ రాజు ఇటీవల పేర్కొన్నారు. సంక్రాంతి సినిమాలను సరిపడా థియేటర్లు ఉన్నాయని అంటున్నారు. మైత్రీ మేకర్స్ కూడా ఇప్పటి వరకూ ఈ విషయం మీద ఎలాంటి కామెంట్ చేయలేదు.
ఏదేమైనా టాలీవుడ్ లోని సీనియర్ హీరోలైన చిరంజీవి - బాలకృష్ణల సినిమాలు ఒకేసారి విడుదల చేయడం అనేది మైత్రీ మూవీ మేకర్స్ కు అతి పెద్ద సవాలుగా మారింది. ఇది ఒకరకంగా అగ్ని పరీక్షే అని చెప్పాలి. మరి ఎలాంటి అవాంతరాలు లేకుండా 'వీరసింహా రెడ్డి' మరియు 'వాల్తేరు వీరయ్య' సినిమాలను ఏ విధంగా రిలీజ్ చేస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.