కోవిడ్ కష్టకాలం చాలా ఇబ్బందులకు గురి చేస్తోంది. ముఖ్యంగా సినీపరిశ్రమల్ని ఈ రంగంపై ఆధారపడి జీవించేవారిని తీవ్ర వేదనకు గురి చేస్తోంది. థియేట్రికల్ రంగంలో కార్మికులకు ఉపాధి లేకుండా చేసింది. 22 అక్టోబర్ 2021 నుంచి మహరాష్ట్రలోని సినిమా హళ్లను తెరవడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. కోవిడ్-19 ముప్పు ఉన్నప్పటికీ రాష్ట్రంలోని థియేటర్లపై ప్రభుత్వం ఆంక్షలు విధించలేదు. అయితే మహరాష్ట్రలోనే ఆ ఒక్క నగరం మాత్రం అందుకు మినహాహయింపు. మహరాష్ట్రలోని అమరావతి లో మాత్రం 50 శాతం ఆక్యుపెన్సీ..రాత్రిపూట పరిమితులతో ఆ నగరం ప్రభుత్వం ఆధీనంలో ఉంది. కొత్త ఏడాది లోనూ ఆ సినిమా థియేటర్ ఇంకా మూతపడి ఉంది. అమరావతి బాలీవుడ్ వ్యాపార రంగానికి చాలా కీలకమైనది. సీపీ-బేరర్ డిస్ట్రిబ్యూషన్ సర్క్యూట్ హబ్ గా ఇది కొనసాగుతుంది. ఏఏ ఫిల్మ్స్..పెన్ మరుధర్..యశ్ రాజ్ ఫిల్మ్స్ ..రాజశ్రీ ప్రొడక్షన్స్.. జీ స్టడియోస్ సహా ఇతర అన్ని ప్రముఖ స్టూడియోలు అమరావతిలో ఉన్నాయి.
అయితే ఈ సిటీలో థియేటర్లు మూత పడటానికి కారణాన్ని ఓ వాణిజ్య నిపుణుడు ఇలా విశ్లేషించారు. ``థియేటర్లు సినిమా లైసెన్స్ లను ఏడాది పాటు కలిగి ఉంటాయి. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకూ సమయం ఉంటుంది. థియేటర్లు సాధారణంగా నవంబర్..అంతకు ముందు పునరుద్దరణ కోసం అబ్యర్ధనల్ని సమర్పిస్తాయి. డిసెంబర్ 31న వారి దరఖాస్తు అంగీకరించబడుతుంది. 31 డిసెంబర్ 2021కి ముందు అమరావతి ఎగ్జిబిటర్లు యథావిథిగా పునరుద్ధరణ కోసం సమర్పించినప్పుడు..అనుకున్నట్లుగా పనులు జరగలేదని ఇదంతా అధికారలు నిర్లక్ష్యం అని వెల్లడించారు.
ఆ కారణంగా 1 జనవరి 2022 లోనూ అమరావతిలో థియేటర్లు తెరుచుకోలేదని తెలుస్తోంది. అయితే ఈ నగరంలో కేవలం ఐదు థియేటర్లు మాత్రమే ఉన్నాయి. కానీ నష్టం మాత్రం చాలా పెద్దది. వందలాది మంది ప్రత్యక్షంగా..పరోక్షంగా జీవనోపాధిని కోల్పోయారు. ఆషర్స్..సెక్యురిటీ గార్డులు..థియేటర్ సిబ్బంది.. ప్లంబర్లు..ఎలక్ట్రీషియన్లు.. ఫుడ్ అండ్ బేవరేజస్ వెండర్లు వంటి బాహ్య సేవలందించే వారు కూడా ఉన్నారు. అంతేగాక సమీపంలోని చిల్లర దుకాణ దారులు.. ఫుట్ పాత్ లపై చిరు వ్యాపారస్తులు వీళ్లంతా థియేటర్ పై ఆధారపడినే వారే. కాబట్టి ఇక్కడ సమస్య ఐదు థియేటర్లు మూతపడటం కాదు..ప్రజల జీవనంపైనే దెబ్బకొట్టినట్లు అయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.