మాజీ భార్య ప్రియుడితో స్టార్ హీరో NYE పార్టీ
అంతేకాదు ఈ పార్టీలో నర్గీస్ ఫక్రీ మాజీ ప్రియుడు, ప్రస్తుత ప్రియుడు కూడా ఫుల్ గా చిల్ అవుతున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇది హాలిడే సీజన్ .. బాలీవుడ్ ప్రముఖులు సుదూర తీరాలకు తరలిపోతున్నారు. పార్టీలతో చిల్ అవుతున్నారు. వార్ 2 షెడ్యూళ్లతో ఏడాది అంతా సతమతమైన హృతిక్ రోషన్ ఎట్టకేలకు వెకేషన్ కి వెళ్లారు. అయితే ఈ పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది. పార్టీలో హృతిక్ మాజీ భార్య, తన ప్రియుడితో పాటు అటెండయ్యారు. అంతేకాదు ఈ పార్టీలో నర్గీస్ ఫక్రీ మాజీ ప్రియుడు, ప్రస్తుత ప్రియుడు కూడా ఫుల్ గా చిల్ అవుతున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పార్టీలో గ్యాంగ్ ఫుల్ గా సందడే సందడి.
ఈ స్పెషల్ పార్టీకి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వెబ్ లో వైరల్ గా మారుతున్నాయి. ఆసక్తికరంగా ఇదే పార్టీలో హృతిక్ రోషన్- సుసానే ఖాన్- అర్ల్ సాన్ గోసాని తో పాటు ఇతర సెలబ్రిటీ జంటల చిల్లింగ్ మూవ్ మెంట్స్ కనిపిస్తున్నాయి. వీరంతా దుబాయ్ లో ఫుల్ గా పార్టీతో చిల్ అవుతున్నారు. ఈ పార్టీలోనే హృతిక్ కుమారుడు హృదాన్ కూడా ఉన్నాడు. హృతిక్ మాజీ భార్య సుస్సాన్ ఖాన్, ఆమె ప్రియుడు అర్ల్‌సాన్ గోనీ పార్టీలో ఎంతో చిల్లింగ్ గా కనిపించగా, నర్గీస్ ఫక్రీ ప్రస్తుత ప్రియుడు టోనీ బేగ్ కూడా ఈ పార్టీలో ఉన్నారనేది ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్.
యాధృచ్ఛికంగా ఇదే పార్టీలో చిల్ చేస్తున్న ఉదయ్ చోప్రా -నర్గీస్ తమ బ్రేకప్ కి ముందు దాదాపు ఐదు సంవత్సరాలు ఒకరినొకరు డేటింగ్ చేశారు. తాజాగా షేర్ చేసిన ఫోటోలలో నర్గీస్ తన మాజీతో కనిపించనప్పటికీ, సుస్సానే , నర్గీస్, టోనీ, అర్ల్‌సాన్‌లతో కనిపించడం గమ్మత్తయిన విషయం. సుస్సానే సోదరుడు, నటుడు జాయెద్ ఖాన్ కూడా తన భార్య మలైకా ఖాన్‌తో కలిసి ఈ వెకేషన్ లో కనిపించారు. బాలీవుడ్ స్టార్ కపుల్ షారూఖ్ ఖాన్ - గౌరీఖాన్ సహా చాలా సెలబ్రిటీ జంటలు విదేశీ వెకేషన్లలో సెలబ్రేట్ చేస్తున్న ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి.