ఒకేరోజు నాలుగు పెద్ద సినిమాలు వస్తే ఖచ్చితంగా ధియేటర్లు దొరకవు. అంటే ధియేటర్లు దొరుకుతాయి కాని.. అలా షేరింగ్ లోకి వదిలేస్తే మనోళ్ళకు తొలిరోజున 20 కోట్ల షేర్ కలక్షన్ అనే రికార్డు సాధ్యపడదు. అందుకే ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ వారం గ్యాపులో ఒక్కొరొక్కరిగా వస్తున్నారు. మరి చిన్న సినిమాల పరిస్థితి ఏంటి?
ఎప్పుడైతే రామ్ చరణ్ హీరోగా వస్తున్న ''ధృవ'' సినిమా రేసు నుండి తప్పించుకుందో.. అప్పుడే వెంటవెంటనే ఇతర సినిమాలన్నీ లైన్లు కట్టేశాయి. అందరూ అక్టోబర్ 7 పైనే కన్నేశారు. అసలే దసరా పండుగ సెలవుల సీజన్ కాబట్టి.. పైగా ఆ రోజు పండగ హాలిడే కూడా కాబట్టి.. మనోళ్ళు ఆ డేటును వదిలిపెట్టట్లేదు. రెండు ప్యూర్ తెలుగు సినిమాలు.. ప్రేమమ్ అండ్ ఈడు గోల్డ్ ఏహా.. మూడు డబ్బింగ్ సినిమాలు.. అభినేత్రి - జాగ్వార్ అండ్ మన ఊరి రామాయణం.. ఆ రోజున విడుదలవుతున్నాయి. వీటిల్లో ప్రేమమ్ సినిమాకు ఈజీగా భారీ ధియేటర్లు దొరుకుతుండగా.. సునీల్ మూవీకి కూడా అంతే. కాని మిగతా వారికి మాత్రం కాస్త ఇబ్బందికరంగా ఉందట. అందులో ఒక సినిమా వారు భారీగా హైర్ రేట్లు చెల్లించి ధియేటర్లు పట్టేస్తుంటే.. ఇంకొకరు మాత్రం మిల్కీ గ్లామర్ ను ఎరగావేసి ధియేటర్లు పట్టేస్తున్నారు.. అంటున్నారు ట్రేడ్ వర్గాలు.
అసలు ఎవరికి ఎన్ని ధియేటర్లు ఇచ్చినా కూడా.. వాటిలో సగం ధియేటర్లు కేవలం మూడు రోజులకు మాత్రమే ఒప్పందం చేసుకున్నాయట. అంటే తక్కిన ధియేటర్లు ఏ సినిమా హిట్టయితే అటువైపు వాలిపోతాయ్ అనమాట. అది వారి స్ర్టాటజీ!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/