సంక్రాంతికి ఒకేసారి మూణ్నాలుగు సినిమాలు రిలీజవడం కొత్తేమీ కాదని చెప్పాడు ఎన్టీఆర్. అది వాస్తవమే కావచ్చు. కానీ ఇప్పట్లా ఒక్కో సినిమాను వెయ్యి థియేటర్లలో రిలీజ్ చేసే పరిస్థితి అప్పుడు లేదు. కాబట్టి నాలుగేంటి ఆరేడు సినిమాలు విడుదల చేసినా థియేటర్లు సరిపోయేవి. కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 2 వేల పైచిలుకు థియేటర్లనే అందరూ పంచుకోవాలి. ఇక్కడే వస్తోంది గొడవ. సంక్రాంతికి విడుదలవుతున్న పెద్ద సినిమాలకు సంబంధించి ఎవరి స్థాయిలో వాళ్లు థియేటర్లను లాగేసుకోవడానికి ట్రై చేస్తుండటంతో గొడవలు తప్పేలా లేవు. ‘నాన్నకు ప్రేమతో’కు సరైన సంఖ్యలో థియేటర్లు దక్కకుండా కుట్ర పన్నుతున్నారన్న ఆరోపణలు ఇప్పటికే చర్చనీయాంశమవుతున్నాయి. మరోవైపు నైజాంలో ఈ సినిమాకే ఎక్కువ థియేటర్లు ఇచ్చేయడమూ వివాదాస్పదమవుతోంది.
ఇదిలా ఉంటే.. కృష్ణా జిల్లాలో ‘డిక్టేటర్’ మూవీకి థియేటర్లు ఇవ్వకపోవడం మీద అక్కడ పెద్ద గొడవే నడుస్తోంది. ‘డిక్టేటర్’కు కోరినన్ని థియేటర్లు ఇవ్వకపోతే.. అంతే సంగతులు అంటూ తెలుగుదేశం నాయకులు కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్లను హెచ్చరిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. విజయవాడకు చెందిన కాకుమాను ప్రసాద్ ‘నాన్నకు ప్రేమతో’ కృష్ణాజిల్లా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాడు. గన్నవరానికి చెందిన తుమ్మల రామ్మోహన్‌రావు ‘డిక్టేటర్’ను, నాగార్జున ఫ్యాన్స్ ఆలిండియా అధ్యక్షుడు సర్వేశ్వరరావు ‘సోగ్గాడే చిన్నినాయన’ను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఐతే ఎన్టీఆర్, నాగార్జునల సినిమాలకు నెల క్రితమే జిల్లాలో థియేటర్ల బుకింగ్ పూర్తయింది. దీంతో ‘డిక్టేటర్’కు జిల్లాలో చాలా తక్కువ సంఖ్యలో హాళ్లు కేటాయించాల్సి వచ్చింది. దీంతో డిక్టేటర్ డిస్ట్రిబ్యూటర్, తెలుగు దేశం నాయకులు కలిసి ఆందోళనకు దిగుతున్నారు. మిగతా రెండు పెద్ద సినిమాల డిస్ట్రిబ్యూటర్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారేలా కనిపిస్తున్నాయి. జిల్లాలోని 108 థియేటర్లలో 80 శాతం మాత్రమే ఎన్టీఆర్, నాగ్ సినిమాలకే బుక్ అయిపోవడం మీద పెద్ద రగడే జరుగుతోందక్కడ. మరి ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.