అప్పుడు వెంకటేష్‌ గారిని చూసి షాక్‌...

Update: 2021-07-23 23:30 GMT
తమిళ సూపర్‌ హిట్ మూవీ అసురన్‌ ను తెలుగు లో నారప్పగా రీమేక్ చేశారు. నారప్ప ఇటీవలే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో సురేష్ బాబు మరియు కళై పులి ఎస్‌ థాను నిర్మించిన నారప్ప లో వెంకటేష్‌ ఇంకా ప్రియమణి మరియు అమ్ము అభిరామిలు నటించారు. అమ్ము అభిరామి పోషించిన కన్నమ్మ పాత్ర ఫ్ల్యాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ లో వస్తుంది. అసురన్‌ లో కూడా కన్నమ్మ పాత్రను అభిరామి పోషించింది. ఒకే పాత్రను రెండు సార్లు పోషించే అవకాశం ఆమెకు దక్కింది. తెలుగు ముందు ముందు అభిరామికి మంచి స్కోప్‌ ఉందంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

అసురన్‌ లో అభిరామి మరియు ధనుష్ ల మద్య సన్నివేశాలు బాగా వచ్చాయి కాని నారప్పలో మాత్రం వెంకటేష్ కు జోడీగా ఆమె కాకుండా మరెవ్వరైనా నటించి ఉంటే బాగుండేది అనే అభిప్రాయంను కొందరు నెటిజన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయం పక్కన పెడితే నారప్ప సినిమా ప్రమోషన్‌ లో భాగంగా అభిరామి మాట్లాడుతూ వెంకటేష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను తెలుగు నేర్చుకోవాలని అనుకున్న సమయంలో చూసిన మొదటి తెలుగు సినిమా ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. ఆ సినిమా లో వెంకటేష్ గారిని చూసి షాక్ అయ్యాను.

వెంకటేష్‌ గారు చాలా స్మార్ట్‌ గా ఆ సినిమాలో నాకు కనిపించారు. ఇంత స్మార్ట్‌ గా ఉన్న వెంకటేష్ గారితో కనీసం ఒక్క సెల్ఫీ తీసుకున్నా కూడా జీవితం ధన్యం అనుకున్నాను. అలాంటి నేను ఆయనతో జోడీగా నటించే అవకాశం దక్కించుకున్నాను. అందుకు నేను అదృష్టవంతురాలిని అన్నట్లుగా వ్యాఖ్యలు చేసింది. ఇక నారప్ప షూటింగ్‌ సమయంలో వెంకటేష్‌ గారితో షూటింగ్ అంటే చాలా కంగారు పడ్డాను.

ఆయన స్వయంగా వచ్చి పలకరించి ధైర్యం చెప్పాడు. తెలుగు రాకపోవడం వల్ల కొన్ని సార్లు ఇబ్బంది అయ్యింది. అయినా కూడా ఆయన స్వయంగా నా కంగారును పోగొట్టేందుకు చొరవ తీసుకుని సీన్ బాగా వచ్చేలా చూశారని అమ్ము అభిరామి అన్నారు. తెలుగు లో ఆఫర్లు వస్తే తప్పకుండా నటిస్తానంటూ చెప్పుకొచ్చిన ఈ అమ్మడు ముందు ముందు తెలుగు లో పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.
Tags:    

Similar News