'జబర్దస్త్' కామెడీ షో ద్వారా చాలామంది కామెడియన్లకు పేరు వచ్చింది. సుడిగాలి సుధీర్ .. హైపర్ ఆది .. గెటప్ శ్రీను వంటి వారు సినిమాల్లోను బిజీ అవుతున్నారు. ఇక మిగతావారు ఇతర గేమ్ షోస్ లోను కనిపిస్తున్నారు. అలాంటివారిలో అప్పారావు కూడా ఒకరుగా కనిపిస్తారు. అయితే కొంత కాలంగా ఆయన ఈ షోలో కనిపించడం లేదు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నారు. "నేను ఇప్పుడు జబర్దస్త్ గా ఉన్నాను గానీ .. జబర్దస్త్ లో లేను. సెకండ్ లాక్ డౌన్ లో మమ్మల్ని ఆపేశారు. కరోనా కారణంగా మా ఏజ్ గ్రూప్ వాళ్లని మాన్పించారు.
అప్పటి నుంచి నేను ఆగిపోవడం జరిగింది. ఇక వాళ్లు కూడా నన్ను హోల్డ్ లో పెట్టారు. అలా చేయడం నాకు బాధనిపించి నన్ను తప్పించండి అనగానే పంపించేశారు. అలా నేను మానేయడం జరిగింది. దాదాపు ఏడెనిమిదేళ్లు జబర్దస్త్ లో చేశాను. మానేస్తుంటే నాకు ఎలాగో అనిపించింది .. కానీ ఆ ఫీలింగ్ వాళ్లకి కూడా ఉండాలి గదా. నన్ను ఒకసారి ఆఫీసుకి పిలిపించి మాట్లాడవచ్చు గదా. "మీకు వచ్చిన కష్టమేంటి? అని అడగొచ్చుగదా? అలాంటిదేమీ చేయలేదు. ఇక్కడ మోసేవాళ్లు .. కూసేవాళ్లు .. తోసేవాళ్లు చాలామంది ఉంటారు. చెప్పుడు మాటలు వినడం చాలా ప్రమాదకరం.
అప్పారావ్ 'బిగ్ బాస్' కి వెళ్లిపోతున్నాడట .. అప్పారావ్ సినిమాల్లోకి వెళ్లిపోతున్నాడట .. ఇలాంటి చెప్పుడు మాటలు ఎక్కువ. ఏ రోజున కూడా నేను షూటింగుకి గానీ .. రిహార్సెల్స్ కి గాని ఎగనామం పెట్టలేదు. జబర్దస్త్ నాకు లైఫ్ ఇచ్చింది .. ఇప్పటికీ కూడా నేను ఇదే మాట చెబుతాను. నేను ఈ ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయికి రావడానికి కారణం కూడా జబర్దస్త్ నే. అందుకు నేను మల్లెమాల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సీనియర్లను గౌరవించాలి .. ఆ గౌరవం అక్కడ తగ్గడంతో నేను బాధపడ్డాను. ఇప్పుడు నేను చేస్తున్న షో నాకు సంతోషాన్ని .. సంతృప్తిని ఇస్తోంది" అన్నారు.
ఇక అప్పారావు శ్రీమతి మాట్లాడుతూ .. "చాలా కాలంగా ఆయన 'జబర్దస్త్' చేస్తూ వచ్చారు. ఆ షో చేయడం వలన ఆయనకి మంచి పేరు వచ్చింది. మిగతా షోలలలో .. సినిమాలలో అవకాశాలు వచ్చాయి. తనతో కలిసి నేను కూడా కొన్ని స్కిట్స్ లో కనిపించాను. కరోనా సమయంలో తన ఏజ్ గ్రూప్ వారిని మేనేజ్ మెంట్ వారు ఆపమన్నట్టుగా బుల్లెట్ భాస్కర్ చెప్పారు.
ఆయన చెప్పినా .. మేనేజ్ మెంట్ చెప్పినా ఒకటే అనుకున్నాము. కానీ 'మమ్మల్ని ఒక మాట ఎందుకు అడగలేదు?' అని ఆ తరువాత మేనేజ్ మెంట్ వారు మాతో అన్నారు. నేను ప్రతి ఎపిసోడ్ కి కాల్ చేసి కనుక్కుంటూనే వచ్చాను. తరువాత ఎపిసోడ్ కి చెబుతామని అంటూ వచ్చారు. అలా 6 నెలలు గడిచిపోయాయి. 'కామెడీ స్టార్స్' కథేతికి రాయడం వలన ఇప్పుడు బాగానే ఉంది లెండి" అని చెప్పుకొచ్చారు.