డైరెక్టర్ పరశురామ్ వెయిటింగ్ మోడ్ లో వుండాల్సిందేనా? .. నెక్స్ట్ మూవీ కోసం మరి కొంత సమయం ఎదురుచూడక తప్పదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పరశురామ్ రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ `సర్కారు వారి పాట` చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ తొలి రోజే ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనని సొంతం చేసుకుంది. తను ఏదైతే ఆశించాడో ఆ స్థాయి విజయాన్ని మాత్రం అందించలేకపోయింది.
దీంతో పరశురామ్ స్టార్ డైరెక్టర్ ల లీగ్ లో చేరలేకపోయాడు. భారీ ఆశలు పెట్టుకున్న ఈ మూవీ యావరేజ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో పరశురామ్ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఈ సినిమా ఫలితం ప్రభావంతో తను చేయబోయే తదుపరి మూవీ ఆలస్యం కాబోతోంది.
వివరాల్లోకి వెళితే.. `సర్కారు వారి పాట` పట్టాలెక్కడానికి ముందు పరశురామ్ హీరో నాగచైతన్యకు కథ వినిపించారు. అది ఓకే అయింది కూడా. 14 ప్లస్ రీల్స్ బ్యానర్ పై ఈ మూవీని పట్టాలెక్కించాలని ప్లాన్ చేశారు.
ఇదే సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు .. సుకుమార్, వంశీ పైడిపల్లిలని పక్కన పెట్టి కొత్త దర్శకుడి కోసం ఎదురుచూస్తున్న సమయంలో పరశురామ్ కు గోల్డెన్ ఆఫర్ ఇచ్చారు. మహేష్ తో సినిమా అన్నది పరశురామ్ డ్రీమ్ ఈ విషయం తెలిసి తన ప్రాజెక్ట్ ని వెనక్కి నెట్టి పరశురామ్ ని మహేష్ తో సినిమా చేసుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాగచైతన్య. దాంతో తను చై సినిమాని పక్కన పెట్టి మహేష్ తో `సర్కారు వారి పాట`ని తెరకెక్కించాడు.
సినిమా రిలీజ్ అయింది. ఇప్పడు పరశురామ్ తన తదుపరి చిత్రాన్ని నాగచైతన్యతో చేయాలని రెడీ అయిపోయాడు. మిడిల్ క్లాస్ యువకుడి నేపథ్యంలో `నాగేశ్వరరావు` టైటిల్ తో ఈ మూవీని ప్లాన్ చేశాడు పరశురామ్, 14 ప్లస్ రీల్స్ సంస్థ ఈ మూవీని నిర్మించడానికి రెడీగా వుంది. అయితే హీరో నాగచైతన్య మాత్రం ఇమ్మిడియట్ గా ఈ మూవీలో నటించడానికి సిద్ధంగా లేడు. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లని అంగీకరించి వున్నాయి.
విక్రమ్ కె. కుమార్ తో చేస్తున్న తొలి వెబ్ సిరీస్ `ధూత` పూర్తి కావాలి. ఆ తరువాత వెంకట్ ప్రభు డైరెక్షన్ లో అంగీకరించిన ద్వి భాషా చిత్రం పూర్తి కావాలి. దీని తరువాతే పరశురామ్ సినిమాకు డేట్స్ కేటాయిస్తాడట. అంత వరకు పరశురామ్ వెయిటింగ్ మోడ్ లో వుండాల్సిందే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. `సర్కారు వారి పాట`కు ముందు నాగచైతన్య పరశురామ్ కోసం వేయిట్ చేస్తే ఇప్పడు తన కోసం పరశురామ్ వేయిట్ చేయాల్సి రావడం విశేషం.