రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తనదైన మార్కు సినిమాలతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హ్యూజ్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నాడు.'అర్జున్ రెడ్డి' సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో విజయ్ దేవరకొండ క్రేజ్ ఇతర ఇండస్ట్రీలకు పాకింది. తనని పాన్ ఇండియా వైడ్ గా భారీ స్థాయిలో వైరల్ అయ్యేలా చేసింది. అయితే గత కొంత కాలంగా తన క్రేజ్ కి తగ్గ స్థాయిలో విజయ్ దేవరకొండ సక్సెస్ లని సొంతం చేసుకోలేకపోతున్నాడు.
రీసెంట్ గా 'లైగర్' మూవీతో పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ ని దక్కించుకోవాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. అంతే కాకుండా భారీ డిజాస్టర్ గా నిలిచి విజయ్ దేవరకొండకు షాకిచ్చింది. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఖుషీ' మూవీలో నటిస్తున్నాడు. సమంత అనారోగ్యం కారణంగా ఈ మూవీ షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. ఇదిలా వుంటే విజయ్ దేవరకొండ హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో ఓ భారీ పాన్ ఇండియా మూవీని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
హీరో అల్లు అర్జున్ మిత్రుడు 'ఫాల్మన్ క్రియేషన్స్ అధినేత కేదార్ సెలగంశెట్టి ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో తెరపైకి తీసుకురావాలని ప్లాన్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ప్రకటించి కూడా దాదాపు రెండేళ్లు కావస్తోంది. 2020లో ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించారు. రజాకార్ కాలం నాటి తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో తెరపైకి తీసుకురావాలని ప్లాన్ చేశారు. ఇందుకు సంబంధించి సుకుమార్ తెలంగాణ సాయుధ పోరాటం, రజాకార్ కాలం నాటి పుస్తకాలని పరిశీలించారట కూడా.
అయితే గత కొన్ని నెలలుగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఎలాంటి అప్ డేట్ బయటికి రావడంలేదు. ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని వార్తలు వినిపించిన ప్రతీ సారి కేదార్ సెలగంశెట్టి స్పందించడంజ.. ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా వుంటుందని చెప్పడం జరుగుతోంది. అయితే ప్రస్తుతం 'పుష్ప 2' పనుల్లో బిజీగా వున్న సుకుమార్ త్వరలో రామ్ చరణ్ తో సినిమాకు రెడీ అవుతున్నారని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో రౌడీ స్టార్ మూవీని సుకుమార్ లైట్ లీసుకున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
విజయ్ దేవరకొండ కూడా సుకుమార్ ప్రాజెక్ట్ గురించి ఎక్కడా మాట్లాడకపోవడం, 'ఖుషీ' తరువాత గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాణంలో సినిమా చేయడానికి రెడీ అయిపోతుండటంతో సుకుమార్ ప్రాజెక్ట్ ఇక అటకెక్కినట్టేననే కామెంట్ లకు బలం చేకూరుతోంది. మరో పక్క బాలీవుడ్ క్రేజీ మేకర్ కరణ్ జోహార్ కూడా విజయ్ దేవరకొండతో భారీ స్థాయి సినిమాని తెరకెక్కించాలని ఎదురుచూస్తుండటం చూస్తుంటే రౌడీ స్టార్ కూడా సుక్కు ప్రాజెక్ట్ ని పక్కన పెట్టాడని అంటున్నారు. ఈ వార్తల్లో వున్న నిజం ఎంతన్నది తెలియాలంటే రౌడీ ప్రాజెక్ట్ పై సుకుమాకర్ లేదా.. విజయ్ దూవరకొండ స్పందించాల్సిందేనని ఇన్ సైడ్ టాక్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.