#చిరు 153.. అనురాగ్ కాదంటే మ్యాడీని సంప్ర‌దిస్తారా?

Update: 2021-04-19 02:30 GMT
మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆచార్య చిత్రీక‌ర‌ణ వేగంగా ముగించి త‌దుప‌రి లూసీఫ‌ర్ రీమేక్ (చిరు 153) రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌ను పట్టాలెక్కిస్తారు. ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ చిత్రానికి సంబంధించిన ఓ రెండు ఆస‌క్తిక‌ర విష‌యాలు తాజాగా తెలిశాయి. ఈ సినిమాకి బైరెడ్డి అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. అలాగే ఇందులో విల‌న్ పాత్ర‌కు పాపులారిటీ ఉన్న న‌టుడిని ఎంపిక చేయ‌నున్నార‌ని తెలిసింది. ఏకే వ‌ర్సెస్ ఏకే లాంటి వైవిధ్య‌మైన సినిమాతో ఆక‌ట్టుకున్న‌ ద‌ర్శ‌క‌న‌టుడు అనురాగ్ క‌శ్య‌ప్ ని సంప్ర‌దించారు. కానీ ఆయ‌న కాల్షీట్ల స‌మ‌స్య‌తో సున్నితంగా తిర‌స్క‌రించార‌ట‌. చిరుతో చేయాల‌ని ఉన్నా కుద‌ర‌డం లేద‌ని అన్నారు. దాంతో ఇప్పుడు విల‌న్ పాత్ర‌కు ఎవ‌రిని ఎంపిక చేస్తారు? అన్న‌ది ఆస‌క్తిగా మారింది. స‌ర్కార్ వారి పాట‌.. పుష్ప చిత్రాల‌కు ఆర్.మాధ‌వ‌న్ ని విల‌న్ గా ఒప్పించార‌ని ప్ర‌చారం సాగుతోంది. అత‌డిని చిరు - మోహ‌న్ రాజా బృందం సంప్ర‌దిస్తుందా? అన్న‌ది వేచి చూడాలి.

ఈ చిత్రాన్ని సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ- సూపర్ గుడ్ ఫిలింస్- ఎన్ వీఆర్ ఫిలింస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.


Tags:    

Similar News