కట్టే భవనం.. పెట్టే పేరు... ?

Update: 2021-10-08 14:30 GMT
మా ఎన్నికలకు గట్టిగా ఇరవై నాలుగు గంటల టైమ్ మాత్రమే ఉంది. మా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అన్నది సినీ అభిమానులకు బుర్రలను వేడెక్కించే టాపిక్ గా మారింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ కి అవుట్ రేట్ గా మెగా కాంపౌండ్ తాజాగా మద్దతు ప్రకటించేసింది. ఆరు నూరు అయినా ప్రకాష్ రాజ్ గెలవడం ఖాయమని మెగా బ్రదర్ నాగబాబు ఢంకా భజాయించారు. అంతే కాదు మా ప్రెసిడెంట్ గా ప్రకాష్ రాజ్ కంటే అర్హులు ఎవరూ లేరన్నట్లుగా కూడా మాట్లాడారు. ఆయన ఉంటేనే మా బాగుపడుతుంది అని కూడా అనేశారు. ఆయన ఒకసారి కాదు, మూడు సార్లు ప్రెసిడెంట్ గా ఉండాలని గట్టిగా కోరుకున్నారు. మొత్తానికి మెగా ఫ్యామిలీ ప్రకాష్ రాజ్ గెలుపుని ఎంతలా కోరుకుంటుందో నాగబాబు మాటల బట్టి అర్ధమైంది.

అన్ని లెక్కలు కూడినా తీసినా, మెగా ఫ్యామిలీకి టాలీవుడ్ లో ఉన్న బలం చూసినా ప్రకాష్ రాజ్ గెలుపు ఖాయమే అన్న మాట ఒక వైపు ఉంది. అదే సమయంలో మంచు విష్ణుకు సీనియర్ హీరోలు, ఇతర నటులు, చిన్న కళాకారులు మద్దతు ఇస్తున్నారు. మరి ఈ పోరులో విజేత ఎవరు అంటే చివరి ఓటుని కూడా లెక్కించేటంత వరకూ చెప్పలేమని కూడా అంటున్నారు. సరే ఆ విషయాలు అన్నీ పక్కన పెడితే ఈసారి మా ఎన్నికలు ఇంతలా ఎందుకు రచ్చ అయ్యాయి అన్నది కనుక ఆలోచిస్తే చాలా అంశాలు ఇందులో ఉన్నాయని అంటున్నారు.

మొదటిది ఆధిపత్య పోరుగా చెప్పుకుంటున్నారు. ఎంతగా మేమంతా ఒకే కులం, మతం అనుకున్నా టాలీవుడ్ లో కూడా కులాల పోరు ఉందని చెబుతారు. ఇక ఒకనాడు అప్పర్ హ్యాండ్ గా ఉన్న ఒక కులం ఇపుడు ఇబ్బందులు పడుతోంది. అదే సమయంలో మరో సామాజికవర్గం హవా మామూలుగా లేదు. అన్నింటా దూసుకుపోతోంది. అలాంటి సమయంలో మాలో కొన్నేళ్ళుగా వారు కోరుకున్న వారే ప్రెసిడెంట్లు అవుతున్నారు. ఈసారి కూడా అదే కోవలో తమ వారినే గెలిపించుకోవాలన్న తపనతోనే వారున్నారని అంటున్నారు. అలా ఆధిపత్య పోరుకు సై అంటే దాన్ని బద్ధలు కొట్టేందుకు ప్రత్యర్ధులు కూడా రెడీ అవుతున్నారు. వారంతా తమ అభ్యర్ధిని గెలిపించుకోవడానికి సర్వ శక్తులు ఒడ్డుతున్నారు.

ఇక మా ఎన్నికలు ఈసారి అంతా మా భవనం చుట్టూ తిరిగాయి. ఎందుకంటే ఈ టెర్మ్ లో ఎవరు ప్రెసిడెంట్ గా వచ్చినా మా భవనానికి పునాది రాయి పడడం ఖాయమని అంటున్నారు. ఇక మా ఎన్నికలకు గట్టిగా ఇరవై నాలుగు గంటల టైమ్ మాత్రమే ఉంది. మా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అన్నది సినీ అభిమానులకు బుర్రలను వేడెక్కించే టాపిక్ గా మారింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ కి అవుట్ రేట్ గా మెగా కాంపౌండ్ తాజాగా మద్దతు ప్రకటించేసింది. ఆరు నూరు అయినా ప్రకాష్ రాజ్ గెలవడం ఖాయమని మెగా బ్రదర్ నాగబాబు ఢంకా భజాయించారు. అంతే కాదు మా ప్రెసిడెంట్ గా ప్రకాష్ రాజ్ కంటే అర్హులు ఎవరూ లేరన్నట్లుగా కూడా మాట్లాడారు. ఆయన ఉంటేనే మా బాగుపడుతుంది అని కూడా అనేశారు. ఆయన ఒకసారి కాదు, మూడు సార్లు ప్రెసిడెంట్ గా ఉండాలని గట్టిగా కోరుకున్నారు. మొత్తానికి మెగా ఫ్యామిలీ ప్రకాష్ రాజ్ గెలుపుని ఎంతలా కోరుకుంటుందో నాగబాబు మాటల బట్టి అర్ధమైంది.

అన్ని లెక్కలు కూడినా తీసినా, మెగా ఫ్యామిలీకి టాలీవుడ్ లో ఉన్న బలం చూసినా ప్రకాష్ రాజ్ గెలుపు ఖాయమే అన్న మాట ఒక వైపు ఉంది. అదే సమయంలో మంచు విష్ణుకు సీనియర్ హీరోలు, ఇతర నటులు, చిన్న కళాకారులు మద్దతు ఇస్తున్నారు. మరి ఈ పోరులో విజేత ఎవరు అంటే చివరి ఓటుని కూడా లెక్కించేటంత వరకూ చెప్పలేమని కూడా అంటున్నారు. సరే ఆ విషయాలు అన్నీ పక్కన పెడితే ఈసారి మా ఎన్నికలు ఇంతలా ఎందుకు రచ్చ అయ్యాయి అన్నది కనుక ఆలోచిస్తే చాలా అంశాలు ఇందులో ఉన్నాయని అంటున్నారు.

మొదటిది ఆధిపత్య పోరుగా చెప్పుకుంటున్నారు. ఎంతగా మేమంతా ఒకే కులం, మతం అనుకున్నా టాలీవుడ్ లో కూడా కులాల పోరు ఉందని చెబుతారు. ఇక ఒకనాడు అప్పర్ హ్యాండ్ గా ఉన్న ఒక కులం ఇపుడు ఇబ్బందులు పడుతోంది. అదే సమయంలో మరో సామాజికవర్గం హవా మామూలుగా లేదు. అన్నింటా దూసుకుపోతోంది. అలాంటి సమయంలో మాలో కొన్నేళ్ళుగా వారు కోరుకున్న వారే ప్రెసిడెంట్లు అవుతున్నారు. ఈసారి కూడా అదే కోవలో తమ వారినే గెలిపించుకోవాలన్న తపనతోనే వారున్నారని అంటున్నారు. అలా ఆధిపత్య పోరుకు సై అంటే దాన్ని బద్ధలు కొట్టేందుకు ప్రత్యర్ధులు కూడా రెడీ అవుతున్నారు. వారంతా తమ అభ్యర్ధిని గెలిపించుకోవడానికి సర్వ శక్తులు ఒడ్డుతున్నారు.

ఇక మా ఎన్నికలు ఈసారి అంతా మా భవనం చుట్టూ తిరిగాయి. ఎందుకంటే ఈ టెర్మ్ లో ఎవరు ప్రెసిడెంట్ గా వచ్చినా మా భవనానికి పునాది రాయి పడడం ఖాయమని అంటున్నారు. ఇక మా భవనం కడితే ఎవరి పేరు పెట్టాలి అన్నది కూడా ఇపుడు చర్చ. సహజంగా సినీ రంగానికి విశేషమైన సేవ చేసిన వారి పేరు పెడతారు, కానీ అలా అయితే మళ్ళీ సామాజికవర్గ సమీకరణలు కూడా తేడా కొడతాయి. అందుకే గతమెంత ఘనం అయినా ప్రస్తుతం వెలిగిపోతున్న వారి ఆధిపత్యంతోనే పేరు పెట్టే కధ కూడా సాగుతుంది అంటున్నారు. అంటే మాకు కట్టే భవనం, పెట్టే పేరు ఇపుడు అసలైన అజెండా అంటున్నారు. దాని మీదనే ఈ పోరు రసవత్తరంగా సాగుతోంది అంటున్నారు. వంద కొట్లతో భవనం కడతామని ఒకరు చెప్పినా మేము కూడా ఆ స్థాయిలో కట్టి చూపిస్తామని మరొకరు రిప్లై ఇచ్చినా టాలీవుడ్ లో కొందరి పేర్లు శాశ్వతం చేయాలన్న ఉత్సాహంతోనే అంటున్నారు. మరి చూడాలి ఎవరు గెలుస్తారు, కట్టే బిల్డింగ్ పెట్టే పేరు కధా కమామీషూ ఏంటన్నది.

. సహజంగా సినీ రంగానికి విశేషమైన సేవ చేసిన వారి పేరు పెడతారు, కానీ అలా అయితే మళ్ళీ సామాజికవర్గ సమీకరణలు కూడా తేడా కొడతాయి. అందుకే గతమెంత ఘనం అయినా ప్రస్తుతం వెలిగిపోతున్న వారి ఆధిపత్యంతోనే పేరు పెట్టే కధ కూడా సాగుతుంది అంటున్నారు. అంటే మాకు కట్టే భవనం, పెట్టే పేరు ఇపుడు అసలైన అజెండా అంటున్నారు. దాని మీదనే ఈ పోరు రసవత్తరంగా సాగుతోంది అంటున్నారు. వంద కొట్లతో భవనం కడతామని ఒకరు చెప్పినా మేము కూడా ఆ స్థాయిలో కట్టి చూపిస్తామని మరొకరు రిప్లై ఇచ్చినా టాలీవుడ్ లో కొందరి పేర్లు శాశ్వతం చేయాలన్న ఉత్సాహంతోనే అంటున్నారు. మరి చూడాలి ఎవరు గెలుస్తారు, కట్టే బిల్డింగ్ పెట్టే పేరు కధా కమామీషూ ఏంటన్నది.

Tags:    

Similar News